మద్దూర్, ఏప్రిల్11 : ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పండుగలా జరుపుకొందామని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ప ట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మద్దూర్ పట్టణంలోని షా గార్డెన్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా మద్దూర్, కొత్తపల్లి, గుండుమాల్, మండలాల బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు.
మహా త్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ముందు గా జ్యోతి బా ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పా ర్టీదే విజయమన్నారు. దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని అన్నారు. కార్యక్రమంలో మద్దూర్, కొత్తపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంచర్ల గోపాల్, మ ధుసూదన్రెడ్డి, నాయకులు శాసం రామకృష్ణ, స లీం, వీరారెడ్డి, శేఖర్, మ్యతరి మహేందర్ ఉన్నారు.