మక్తల్ : బీఆర్ఎస్ను ( BRS) కాదని ఇతర పార్టీలకు వెళ్లిన నాయకులు, కార్యకర్తలు మళ్లీ పార్టీలోకి వస్తామంటే కనీసం పార్టీ కండువాను ముట్టుకోనివ్వబోమని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి (Chittem Rammohan Reddy) అన్నారు. ఈ నెల 27న వరంగల్లో ( Warangal ) నిర్వహిస్తున్న రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.
ఆదివారం మక్తల్ పట్టణ అధ్యక్షులు చిన్న హనుమంతు అధ్యక్షతన మాజీ ఎమ్మెల్యే నివాస గృహంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల సన్నాహక సమావేశానికి చిట్టెం రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను దోచుకున్న నాయకులు, కార్యకర్తలు పార్టీని వదిలి బయటికి వెళ్లిపోయారని ఆరోపించారు.
ఇతర పార్టీలో వారికి గుర్తింపు లేకపోవడంతో తిరిగి బీఆర్ఎస్లో చేరేందుకు వస్తే పార్టీలోకి తీసుకోబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ను నమ్ముకొని ఉన్న కార్యకర్తలను సైనికుల్లాగా తయారుచేసి రాబోయే రోజుల్లో పార్టీ విజయానికి దోహదపడే విధంగా కార్యకర్తలను సిద్ధం చేస్తానని సూచించారు. పార్టీకి 63 లక్షల కార్యకర్తల సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ బీఆర్ఎస్యే నని అన్నారు.
కార్యక్రమంలో మక్తల్, మాగనూర్, కృష్ణ, అమరచింత, ఆత్మకూర్ మండల పార్టీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, రవికుమార్ యాదవ్, రమేష్ ముదిరాజ్, ఎల్లారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీలు అరవింద్ కుమార్, శివరాజ్ , మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆశిరెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.