గట్టు, ఏప్రిల్ 17 : ఈనెల 27న వరంగల్‌లోని ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని గద్వాల నియోజకవర్గ నేత బాసు హనుమంతు కోరారు. మండలంలోని బోయలగూడెంలో ప్రత్యేక సమావేశాన్ని గురువారం నిర్వహించారు. అంతకుముందు గ్రామంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో హనుమంతు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ పార్టీని స్థాపించి 25ఏండ్లు కావొస్తున్న సందర్భంగా వరంగల్‌లో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండాను ఎగరవేసి సభకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం చైతన్య రథానికి పూజలు చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బస్వరాజు, చక్రధర్‌రావు, రాజు, జయసింహారెడ్డి, మోనేశ్, రామునాయుడు, శేఖర్‌నాయుడు, వెంకటేశ్నాయుడు, గోపాల్, రాజునాయుడు, శ్రీరాములు, తిరుమలేశ్, వీరేశ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.