భూత్పూర్, జనవరి 15 : త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. బుధవారం ఆయన భూత్పూర్లోని సాధిక్ ఇంట్లో కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. ముందుగా గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్, మాజీ సర్పంచులు సత్తూర్ నారాయణగౌడ్, సత్యనారాయణ, ఆంజనేయులు, బీఆర్ఎస్ నాయకులు సాయిలు, మురళీధర్‌గౌడ్, సత్యనారాయణ, వెంకట్రాములు, ఆల శ్రీకాంత్‌రెడ్డి, అశోక్‌గౌడ్, సురేశ్, గడ్డం రాములు, బ్రహ్మయ్య, మల్లేశ్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.