నాగర్కర్నూల్ : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ( Bandi Bhagiratha )పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్( Arrest ) చేయకుండా కాలయాపన చేస్తున్నారని నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ( BRS ) నాయకులు ఆరోపించారు. వెంటనే అతడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు.
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్, రాష్ట్ర హోమ్ శాఖను దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి కుమ్మక్కై కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. మైనర్ బాలికకు న్యాయం చేయకుండా, బండి సంజయ్ కుమారుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రంలో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు.
జరిగిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ పదవికి రాజీనామా చేయాలని, రేవంత్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, లేనిపక్షంలో బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.