వనపర్తి టౌన్, జూలై 4 : ప్రశ్నించే గొంతుకలపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని బీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షుడు అన్నారు. కాంగ్రెస్ చర్యలకు నిరసిస్తూ శనివారం గట్టు యాదవ్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్య క్తం చేశారు. ఈ సందర్భంగా గట్టుయాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా అరాచక, అవినీతి పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ రేవంత్‌రెడ్డి ప్రభుతంపై చేస్తున్న అవినీతి, విధ్వంస పాలనను గొంతెత్తి నిలదీస్తుంటే ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను తీసుకొస్తుందని తట్టుకోలేక ఏ విధమైన ముందస్తు సమాచారం లేకు ండా భద్రతను తగ్గించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ సేవలు రాష్ర్టానికి అందించి శాంతి భద్రతలు కాపాడడానికి అసాంఘిక శక్తులతో తనప్రాణాలు సైతం లెక్కచేయ్యకుండా పోరాడిన ఉన్నతస్థాయి అధికారికి ప్రభుత్వం ఇస్తున్న గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. వ్యక్తిగత కక్షతో ప్రవీణ్‌కుమార్ సతీమణి మహాలక్ష్మీని కూడా ప్రాధాన్యత లేని శాఖకు బదిలీ చేయడం నీచమైన చర్య అని ఖండించారు. ఆర్ఎస్పీకి ప్రభుత్వం రక్షణ కల్పించకపోయినా ప్రజలే కాపాడుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ ఆర్ఎస్పీకి ఎటువంటి ముప్పు వాటిల్లినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించా రు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ నాయకుల సతీమణులు ఉన్నత స్థాయిలో ఉన్నా ఏనాడు వారిపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడలేదని గుర్తుచేశారు.
మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు వెంటనే భద్రతా కల్పించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ఎస్పీ సునీతారెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు గతంలో ఉన్న భద్రతను యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, నాయకులు పద్మ, వెంకటేశ్, ధర్మానాయక్, గంధం పరంజ్యోతి, మాణిక్యం, వనం రాములు, ఉంగ్లం తిరుమల్, జాతృనాయక్, దొడ్ల రాములు, విజయ్‌కుమార్, భారతి ప్రేమ్‌నాథ్‌రెడ్డి, ఏర్వ అరుణ, శ్రీనివాసులు, నాగన్నయాదవ్, రహీం, ఇమ్రాన్, వెంకట్‌సాగర్, హేమంత్ ముదిరాజ్, జోహెబ్ హుస్సేన్, గిరి, సయ్యద్, జమీల్, మహేశ్వర్‌రెడ్డి, బాలస్వామి, వడ్డే రమేశ్, చిట్యాల రాము, కవితానాయక్, మంద రాము, రమేష్, వడ్డెమాన్ రవి, నాగరాజు, యుగంధర్, గొర్ల బాలయ్య, అలీమ్, శంకర్, ఖదర్సా, ఖాదర్, విజయ్‌సాగర్, లోకాజి పాల్గొన్నారు.