నారాయణపేట, డిసెంబర్ 9 : బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో నవశకానికి నాంది పలుకుతుందని బీఆర్ఎస్ పట్ట ణ అధ్యక్షుడు విజయ్‌సాగర్ అన్నారు. ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను శ్రేణులు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని చెప్పా రు. ఢిల్లీలో బీఆర్ఎస్ జెండా ఎగురవేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పటాకులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ జగదీశ్, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్ గురులిం గం, ఆర్గనైజింగ్ సెక్రటరీ సుభాష్, మైనార్టీ సెల్ నాయకుడు మహిమూద్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ టౌన్, డిసెంబర్ 9 : దేశంలో కేసీఆర్ మరొక ప్ర స్థానం మొదలైందని భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన సందర్భంగా దేశంలో ప్రతి భారతీయుడి కలలు సాకారమ య్యే తరుణం అసన్నమైందని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి అన్నారు. మక్తల్ టౌన్ పార్టీ అధ్యక్షుడు అమరేంధర్రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం చేపట్టిన సంబురాల కార్యక్రమంలో మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి అనంతరం దేశ భవిష్యత్తు, ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన విధంగానే భారత ప్రజల కలలను సాకారం చేయాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ఏర్పాటు అయ్యిందన్నారు. అంబేద్కర్ చౌరస్తాలో పటాకులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.