జడ్చర్ల, నవంబర్ 18 : జడ్చర్ల మున్సిపాలిటీని గులాబీ పార్టీ మళ్లీ కైవసం చేసుకున్నది. కోనేటి పుష్పలతను ఏకగ్రీవంగా చేస్తూ ఆర్డీవో నవీన్ నియామక పత్రా న్ని అందజేశారు. రెండు నెలల కిందట పార్టీలో కొంతమందిని రెచ్చగొట్టినప్పటికీ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి చక్రం తిప్పి మళ్లీ బీఆర్ఎస్కే పీఠం దక్కేలా పావులు కదిపారు. కాంగ్రెస్ నేతలకు ఆశాభంగం తప్పలేదు. ఒక్క కౌన్సిలర్ కూడా పార్టీ గీత దాటకపోవడంతో మళ్లీ బీఆర్ఎస్కే చైర్మన్ పదవి దక్కింది. సోమవారం జడ్చర్ల ము న్సిపాలిటీలోని సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు కౌన్సిలర్లతో ఆర్డీవో నవీన్ సమావేశం నిర్వహించారు.
గతంలో చైర్‌పర్సన్‌గా ఉన్న దోరేపల్లి లక్ష్మిని రెండు నెలల కిందట అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి పదవి నుంచి పాలకవర్గం తొలగించింది. చైర్పర్సన్ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే 26వ వార్డు కౌన్సిలర్ శశికిరణ్ పుష్పలత పేరు ప్రతిపాదించగా, 17వ వార్డు కౌన్సిలర్ గుంటికాడి చైతన్య బలపరిచారు. పుష్పలత త ప్పా ఇంకెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైంది. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పా ర్టీ కౌన్సిలర్లందరూ పుష్పలతకు మద్దతు ఇవ్వాలని సూ చించారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికకు సరిపడా సంఖ్యా బలం లేకపోవడంతో చైర్పర్సన్ పదవికి నామినేషన్ వే యలేదు. చివరి వరకు కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. మళ్లీ జడ్చర్ల పీఠం బీఆర్ఎస్కే దక్కడంతో పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. చైర్‌పర్సన్‌గా ఎన్నికైన పుష్పలతోపాటు కౌన్సిలర్లు మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించారు.