వరంగల్ రజతోత్సవ సభను విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. మొక్కవోని దీక్షతో కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి పెద్దఎత్తున తరలివచ్చారు. మేము అనుకున్న లక్ష్యానికి మించి ఇంతటి జనాన్ని చూసి మాకే ఆశ్చర్యం కలిగింది. వరంగల్ దూరం కావడంతో పరిధిమేర కార్యకర్తలను తరలించాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది.
అయినప్పటికీ ఊహించిన దానికంటే పెద్దమొత్తంలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలిరావడం చూస్తుంటే రానున్న రోజుల్లో గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయం. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు వరంగల్ సభకు వెళ్లేలా ఏర్పాట్లు చేశాం. కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది.
– వి. శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి, మహబూబ్‌నగర్