భగ్గుమన్న బీఆర్ఎస్
మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్రంలో చేసిన అప్పులపై చర్చకు రమ్మని గులాబీ పార్టీ నేతలకు సవాల్ విసిరిన మంత్రి జూపల్లి ముఖం చాటేయడంపై కన్నెర్ర చేశారు. రాష్ట్రంలో చేసిన అప్పులపై చర్చకు రమ్మని బీఆర్ఎస్ నేతలను పిలిచిన మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖం చాటేయడమే కాకుండా చర్చకు వచ్చిన మా బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయించడం ఏమిటని నిలదీశారు.
- నాగర్‌కర్నూల్‌లో గులాబీ పార్టీ నాయకుల ధర్నా
- మంత్రి జూపల్లి కృష్ణారావు తీరుపై నిరసన హోరు
- అప్పులపై చర్చకు వస్తానంటూ మొఖం చాటేశారని తీవ్ర ఆగ్రహం
- ప్రజాపాలనలో స్కీమ్‌లు కాకుండా స్కామ్‌లు నడుస్తున్నాయని ఫైర్
- ముఖ్యమంత్రి రేవంత్ దిష్టిబొమ్మ దహనానికి యత్నం
- నేతలను అడ్డుకున్న పోలీసులు
నాగర్‌కర్నూల్, జూలై 2 : మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్రంలో చేసిన అప్పులపై చర్చకు రమ్మని గులాబీ పార్టీ నేతలకు సవాల్ విసిరిన మంత్రి జూపల్లి ముఖం చాటేయడంపై కన్నెర్ర చేశారు. రాష్ట్రంలో చేసిన అప్పులపై చర్చకు రమ్మని బీఆర్ఎస్ నేతలను పిలిచిన మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖం చాటేయడమే కాకుండా చర్చకు వచ్చిన మా బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయించడం ఏమిటని నిలదీశారు. ఇందుకు నిరసనగా నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నాకు దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ నిత్యం ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నదని ఆరోపించారు. జూపల్లికి గానీ.. ఇతర మంత్రులు ఎవరికైనా దమ్ముంటే చర్చకు రావాలన్నారు. జూపల్లి పూటకోమాట మాట్లాడుతున్నారని, చర్చకు తెలంగాణ భవన్‌కు వస్తానని చెప్పి సవాల్ చేసి తోకముడుచుకుపోవడం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు వచ్చే సరికి పారిపోయి పిల్లిలా మారారని ఎద్దేవా చేశారు. భయంతోనే తెలంగాణ భవన్ సమీపంలోకి కూడా రాకపోవడం పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. చర్చకు రాని నీవు హరీశ్‌రావు, మా నాయకత్వానికి సవాల్ విసిరేంత స్థాయి నీకు లేదన్నారు.
గన్‌పార్క్‌కు వెళ్తున్న హరీశ్‌రావు, బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో అరెస్టు చేయించి చర్చకు రమ్మనడం జూపల్లికి, ఇతర మంత్రుల చేతగాని తనానికి నిదర్శమన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా ప్రజాకంఠక పాలన నడుస్తుందని, స్కీమ్‌లు కాకుండా స్కామ్‌లు నడుస్తున్నాయని విమర్శించారు. సంక్షోభం దిశగా రాష్ట్రంలో పాలన సాగుతోందని మండిపడ్డారు. పదేళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏవిధంగా ఉందో.. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రెండున్నరేండ్లలో ఏ విధంగా భ్రష్టు పట్టిందో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. అభివృద్ధి విషయంలో ఏనాటికీకేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సరితూగలేరన్నారు.
దమ్ముంటే జూపల్లి కానీ ఇతర మంత్రులు ఎవరి వద్దనైనా సత్తా ఉంటే, సబ్జెక్టు ఉంటే, కంటెంట్ ఉంటే సవాల్ చేసినట్లుగా చర్చకు రావాలన్నారు. రాష్ట్రంలో చేసిన అప్పుల గురించి మంత్రి జూపల్లి పూటకోమాట మాట్లాడుతున్నారని, చర్చకు రమ్మంటే తోకముడిచాడన్నారు. తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్, హరీశ్‌ను చూసి జూపల్లికి లాగు తడిసి పోలీసులను ఉసిగొలిపి అరెస్టు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేయించి చర్చకు రమ్మనడం మీ చేతగాని తనానికి నిదర్శమన్నారు.
అరెస్టులపై పొంతనలేని సమాధానాలు చెప్పి, గన్‌పార్క్ నుంచి పారిపోయిన నీకు కొల్లాపూర్ ప్రజలు పాడె కట్టడం ఖాయమన్నారు. చర్చకు రమ్మని ఎందుకు అడ్డుకుంటున్నారని మంత్రులు అడ్లూరి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్‌కి హరీశ్‌రావు ఫోన్ చేసినా ఎత్తకుండా.. సమాధానం చెప్పకుండా పారిపోవడంతోనే మీ పనితనం ఏమిటో తెలిసిపోయిందన్నారు. రేవంత్‌రెడ్డికి ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ధైర్యం లేదన్నారు. రాష్ట్రంలోని రైతులు కానీ, శ్రామికులు కానీ, ఉద్యోగులు, నిరుద్యోగులు సంబ్బండ వర్గాలు మీకు బుద్ధి చెప్పేందుకు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారన్నారు.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చిక్కొండ శ్రీశైలం, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ హన్మంతురావు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటయ్య, నాయకులు జోగు ప్రదీప్, భాస్కర్‌గౌడ్, కౌన్సిలర్ ప్రకాశ్‌చారి, లక్ష్మయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, రమణ, షఫీ, రమేశ్‌గౌడ్, నాగయ్య, బీఆర్ఎస్ నాయకులు మధు, వంశీతోపాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

