MLA Vijayudu | అలంపూర్ : అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండలం కొండేరు స్టేజి దగ్గర వడ్లు కొనుగోలు కేంద్రాన్ని గురువారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు. రైతులు పండించే వడ్లు మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఆరా తీశారు. రైతులకు ఉపయోగకరంగా ఈ కొనుగోలు కేంద్రం ఉపయోగపడాలని కొనుగోలు కేంద్రం అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం వచ్చేలా కాకుండా, లాభాలు వచ్చేలా దానికి అనుగుణంగా అధికారులు రైతులను సమన్వయం చేసుకోవాలని రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.