మహబూబ్‌నగర్, నవంబర్ 20 : ప్రజల పక్షాన ప్రశ్నించే వారిపై ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేస్తుందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. అ క్రమ కేసులో జైలుకు వెళ్లిన మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్‌గౌడ్ బుధవా రం సాయంత్రం జిల్లా జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. మాజీ మంత్రి శ్రీ నివాస్ గౌడ్ తమ్ముడిపై పోలీసులు అక్రమ కేసుల్లో శ్రీకాంత్‌గౌడ్‌ను బా ధ్యుడిగా చేస్తూ గతనెలలో కోర్టు ఎ దుట హాజరుపర్చగా 14రోజులు రి మాండ్ విధించారు.
జిల్లా జైలులో ఉంటున్న శ్రీకాంత్‌గౌడ్‌కు 27 రోజుల తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది. జైలు నుంచి విడుదులైన శ్రీకాంత్‌గౌడ్‌ను పాలకొండలోని ఫాంహౌస్‌కు హరీశ్‌రావు చేరుకొని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూలగొట్టిన అం ధుల, దివ్యాంగుల ఇండ్లను నిర్మించి ఇవ్వాలని అడిగినందుకు శ్రీకాంత్‌గౌడ్‌పై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేసి జైలుకి పంపించారని విమర్శించారు.
శ్రీనివాస్‌గౌడ్ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కొనలేక తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించా రు. ధైర్యంగా ఉండాలని.. పార్టీ అండగా ఉంటుంద ని ఆభయమిచ్చారు. నాయకులు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, కేసులకు భయపడొద్దని కోరా రు. అలాగే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ మన్నె, మాజీ ఎమ్మెల్యే లు ఆల, గువ్వల, మాజీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివా స్, రజినీ, అభిలాశ్‌రావు శ్రీకాంత్‌గౌడ్‌ను కలిసి పరామర్శించారు. బెయిల్‌పై విడుదులైన శ్రీకాంత్‌గౌడ్‌ను పరామర్శించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొన్నారు.