వనపర్తి టౌన్, ఫిబ్రవరి 7 : కేసీఆర్‌ది నిర్మాణాల పాలన అయితే రేవంత్‌ది విధ్వంసాల పాలన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దుయ్యబట్టారు. వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా శనివారం 1, 2, 13, 14 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కాగితా ల శారద, ఉందేకోటి శివ, పి.రాజు, పవి త్ర భానుల తరఫున కమాన్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మా జీ మంత్రి మా ట్లాడుతూ 12ఏండ్ల కింద జిల్లా ఏర్పాటు చేసి పరిపాలన సౌలభ్యం కోసం 55రకాల కార్యాలయాలు ఏర్పాటు చేస్తే నిర్మాణాలు చేతకాని రేవంత్‌రెడ్డి జిల్లాను రద్దు చేస్తానంటున్నాడని జిల్లా రద్దు చేసే వాళ్లకు ఓట్లు వేయాలనా అని ప్రశ్నించారు.
అబద్ధాలకు బ్రాండ్ అం బాసిడర్‌గా కాంగ్రెస్ పార్టీ నిలిచిందని మహిళలకు రూ.2500, కల్యాణలక్ష్మితో పాటు తు లం బంగారం, ఆసరా పింఛన్లు, రూ.4వేలు, రైతు భరోసా రూ.15వేలు, కేసీఆర్ కిట్టు, విద్యార్థినులకు స్కూటీలు ఎగ్గొట్టారని మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు 42శాతం పెంచి వారి ప్రతిష్ఠ పెంచారని, లక్షా63వేల ఉద్యోగాలు ఇచ్చి యువతను ఆదుకున్నారని కేసీఆర్ సంక్షేమ పాలన మళ్లీ కావాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం ఆయా వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ, దుకాణ, కూరగాయల యజమానులతో మాజీ మంత్రి మా ట్లాడి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గట్టుయాద వ్, లక్ష్మయ్య, రమేశ్‌గౌడ్, నందిమల్ల అశోక్, వేణుగోపాల్, గులాంఖాదర్ఖాన్, భానుప్రకాశ్, బాలపీరు, నీలస్వామి, బొబ్బిలి ప్రేమ్‌కుమార్, హేమంత్ ముదిరాజ్, సయ్యద్, జమీల్, జోహెబ్ హుస్సేన్, చిట్యాల రాము, నాగమ్మ, జ్యోతి, క్రాంతి, సుధాకర్, నాగన్న, కరుణాకర్, రాములు పాల్గొన్నారు.

ప్రచారం పరుగులు
వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పాదయాత్రతో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు. శనివారం 33, 14, 15, 16 వార్డుల అభ్యర్థులు ఉంగ్లం అలేఖ్య, పవిత్ర, సుజాత, అయేషాల తరఫున మాజీ మంత్రి వార్డుల్లో విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం చేశారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన, అపూర్వ స్వాగతం లభించిందని ప్రజలు నిరంజన్‌రెడ్డికి ఎదురేగి తమ వార్డుల్లో మీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, కేసీఆర్ పాలనలోనే సంక్షేమ పథకాలు అందాయని తప్పక కారు గుర్తుకు ఓటు వేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సం దర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఎంతో కష్టపడి జిల్లాను సాధించి తెస్తే జిల్లా రద్దు చేస్తామని అంటున్నారు ఇది న్యాయంగా ఉందా? అని ప్రజలను ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తూ మమ్మల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో బు ద్ధి చెప్పి బీఆర్ఎస్కు అండగా ఉంటామని నందిమల్ల అశోక్ చెప్పారు. నిరంజన్‌రెడ్డి పాదయాత్రతో జననీరాజనంతో వార్డులన్ని గులాబీమ యం కావడంతో పాటు కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకొని అభివృద్ధిని సాధించుకుందాబనా విజ్ఞప్తి