కర్షకులపై కాంగ్రెస్ సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది.. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న తమకు న్యాయమైన పరిహారం ఇప్పించాలని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తిలో దీక్షలు చేపట్టి అక్కడి నుం చి దామరగిద్ద వ రకు పాదయాత్రను ప్రా రంభించా రు. ఈ క్రమంలోనే పాదయాత్ర గడిమున్కన్పల్లి వద్ద రైస్‌మిల్లు వద్ద భోజనం చేసి వెళ్తుండగా పోలీసులు రైతులను అడ్డుకున్నారు.
అయినప్పటికీ రైతులు వెనుకడుగు వేయకుండా పోలీసుల జులూం నశించాలం టూ నినాదాలు చేస్తూ దామరగి ద్ద వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం తాసీల్దార్ తిరుపతయ్యకు సమస్యలో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కిషన్‌రావు, వైస్ ఎంపీపీ దామోదర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ భీంరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ నాయకులు భీమయ్యగౌడ్, రైతు సంఘం జిల్లా నాయకుడు వెంకట్రామిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గోపాల్, అంజిలయ్యగౌడ్, రైతులు పాల్గొన్నారు.
ఎకరాకూ రూ.30 లక్షలు ఇవ్వాలి
దామరగిద్ద, ఆగస్టు 7 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అ న్నారు. పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భా గంగా సుమారు 720 ఎకరాల భూములు కోల్పోతు న్న రైతులకు మద్దతుగా గురువారం కానుకుర్తిలో భూ నిర్వాసితులు రిలే నిరాహారదీక్షలు నిర్వహించగా ఆ యన పాల్గొని అక్కడి నుంచి మండల కేంద్రానికి చేపట్టిన పాదయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భం గా పలువురు మహిళ రైతులు తమ సమస్యను ఎస్ఆర్రెడ్డికి చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చెబుతున్న ట్లు ఎకరాకు రూ.14లక్షల పరిహారం ఏమాత్రం సరిపోవని కనీసం రూ.30లక్షలు చెల్లించడంతోపాటు ఇంటికో ప్రభుత్వ ఉద్యో గం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రెవెన్యూ అధికారులకు ఒకటే చెబుతున్న ము ందు మీరు గ్రామసభలు పె ట్టండి రైతులకు డీపీఆర్ ముందు చూపెట్టండి, ఏఏ సర్వే నెంబర్లకు నీళ్లు ఇస్తున్నారు.. ఏఏ సర్వే నెంబర్లు ప్రాజెక్టు కింద పోతున్నా సరియైన సమాచారం ఇవ్వాలని సూచించారు.
లేదంటే రైతుల భూములు ఇచ్చేది లేదని, రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని, కేసీఆర్ సీఎం అయితే రైతులకు న్యాయం జ రుగుతుందని అంత వరకు ఓపిక పట్టాల ని సూచించారు. భూ నిర్వాసి త రైతులకు న్యా యం జరిగే వరకు వెంటే ఉంటానని ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.