పెంట్లవెల్లి, అక్టోబర్ 12 : మండల కేంద్రంలో చిన్నచిన్న సమస్యలను పరిష్కరించడంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పోతుల వేంకటేశ్వ ర్లు, మండల వర్కింగ్ ప్రెసిడింట్ గోవురాజు, మండల సీ నియర్ నాయకులు రాజేశ్, సురేందర్‌గౌడ్ ఆరోపించారు. మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గత కొంత కాలంగా లోతుగా గుంతలు ఏర్పడి బురదమయ్యంగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇదే అదునుగా ఆర్టీసి డ్రైవర్లు సైతం బ స్టాండ్‌లోకి బస్సులను తీసుకురావడానికి నిరాకరిస్తుండడంతో ప్రయాణికుల ఇబ్బందులను చూసి అధికారంలో ఉన్నా లేకున్నా అభివృద్ధి పనుల్లో ముందుం టాం…అని మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం బస్టాండ్ ఆవర్ణంలో ఏర్పడ గుంతలను టిప్పర్ల ద్వారా మొరం తీసుకువచ్చి జేసీబీతో పూడ్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టించుకోకపోవడంతోనే బస్టాండ్‌లోకి ఆర్టీసీ బస్సులు రావ డం లేదని వారు మండిపడ్డారు.
అంతేకాక మండల కేం ద్రంలోని వివిధ కాలనీల్లో పారిశుధ్యంతో పాటు మురుగు నీరు ఇండ్లలోకి వస్తున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా స్థానిక అధికార పార్టీ నాయకులు మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకుపోయి సమస్యల పరిష్కారం కోసం కృషిచేయాలని వారు డిమాండ్ చేశారు. అంతకు ముందు బస్టాండ్ ఆవర్ణంలో ఏర్పడ లోతట్టు గుంతల వల్ల లోపలికి వెళ్లడం ఇబ్బందిగా ఉందని బస్టాండ్ ముందు ఆర్టీసీ డ్రైవరు, కండక్టర్ల్లు బస్టాండ్‌లోకి బస్సులను తీసుకుపోకుండా ఆపి మరి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు మేఘరాజు, అబ్దుల్‌హుస్సేన్, యాగౌస్, రఫీ, ముబీన్, కొత్త శివుడు, బాలరాజు తదితరులు ఉన్నారు.