మద్దూర్, ఆగస్టు 15 : నిజాలు రాస్తే నమస్తే తెలంగాణ పత్రికపై విషం కక్కుతారా? మీ క బ్జాలపై ప్రశ్నిస్తే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేపై చిల్లర ఆరోపణలు చేస్తారా అంటూ మద్దూర్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు దినేశ్, నర్సింహులు కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వికా రాబాద్ జిల్లా హకీంపేటకు చెందిన కాంగ్రెస్ నేత నర్సింహారెడ్డి తన కబ్జాలను బయటపెట్టార న్న అక్కసుతో విచక్షణ కోల్పోయి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిపై చిల్లర ఆరోపణలు చేస్తూ దిగజారుడు తనానికి పాల్పడుతున్నారని, ఈ దుశ్చర్యలకు పాల్పడిన కాంగ్రెస్ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చేయలేదని, ప్రజల అకాంక్ష మేరకు పని చేసిందన్నారు. హకీంపేట కాంగ్రెస్ నేత కబ్జాలు చేయకుంటే అంతలా కోపం ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. నీతిపరుడైతే భూములు ఇచ్చిన రైతులందరితో కలిసి మీడియాకు చెప్పించాలి త ప్పా ఇలా సంస్కారం మరిచి పత్రికపై తమ నే తలపై విమర్శలు చేయడం తగదని పేర్కొన్నా రు.
మరోసారి తమ నేతలపై ఇలాంటి వ్యా ఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. మీ సంస్కారం సభ్యతను చూసి సమాజం సిగ్గు పడుతోందని, మీ మాటలు విన్న ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. మరోసారి మాజీ ఎమ్మెల్యేపై గానీ లేదా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ కూర్చోమని ఇచ్చే సమాధానం మరోలా ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మౌలానా, గోపాల్, లింగ్య నాయక్, బీఆర్ఎస్ నేతలు అంజయ్య, హబీబ్, నారాయణ, భీం సేన్, నజిముద్దీన్ పాల్గొన్నారు.