వనపర్తి, మార్చి 6 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చె ప్పి నేడు డబ్బులు కట్టాలని చెబుతున్నదని, వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ ఎదు ట బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ముందుగా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు 420 హామీలను ఇచ్చిందని, ఇచ్చిన హామీలకు తి లోదకాలు ఇస్తూ ప్రజలపై భారం మోపేందుకు ప్రణాళికలు చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఎల్ఆర్ఎస్ చార్జీలు లేకుండా ఉ చితంగా చేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన లు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పలుస రమేశ్‌గౌడ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్, నాయకులు కోళ్ల వెంకటేశ్, పాకనాటి కృష్ణ, పుట్టపాకుల మహేశ్, నాగన్నయాదవ్, గులాంఖాదర్, గంధం పరంజ్యోతి, అశోక్, నీలస్వామి, ఎర్రశ్రీను, తిరుమల్, రమేశ్‌నాయక్, ప్రేమ్, శ్రీనివాసులు, ఇంతియాజ్, రహీం, వెంకటేశ్, హేమంత్, గిరి, శరవంద, గోపాల్‌యాదవ్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, వినోద్‌గౌడ్, యుగంధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.