జడ్చర్లటౌన్, అక్టోబర్ 15 : బీఆర్ఎస్ పార్టీ అమలు చేయనున్న ప్రజా సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోను విడుదల చేసిన నేపథ్యంలో ఆదివారం జడ్చర్లలో బీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకొన్నారు. స్థాని క అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యకర్తలు జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ పటాకులు కాల్చి సంబు రాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్‌చైర్మన్ యాద య్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి పాల్గొని మాట్లాడా రు. అన్ని వర్గాలకు ఉపయోగకరంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉందన్నారు. ముఖ్యంగా పేద ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది.. అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. అంతకుముందు మండలంలోని పెద్ద ఆదిరాల గ్రామంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి టీవీలో ప్రసారమవుతున్న సీఎం కేసీఆర్ విడుదల చేస్తున్న మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని తిలకించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మురళి, రఘపతిరెడ్డి, కొంగలి జంగయ్య, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ముడా, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
మిడ్జిల్‌లో..
మిడ్జిల్, అక్టోబర్ 15 : తెలంగాణ భవనంలో సీఎం కేసీఆర్ జడ్చర్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి బీఫాం అందజేయడంతో మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం మండల కేంద్రంలో జడ్చర్ల- కల్వకుర్తి ప్రధాన రహదారి వద్ద పటాకులు కల్చుతూ సంబురాలు జరుపుకొన్నారు. ముచ్చటగా మూడో సారి లక్ష్మారెడ్డి లక్ష మోజార్టీతో ఎమ్మెల్యేగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, ఎంపీపీ సుదర్శన్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు జంగిరెడ్డి, నాయకులు బాలు, వెంకట్‌రెడ్డి, జగన్‌గౌడ్, అం బాచారి, వీరారెడ్డి, వరుణ్‌రాజు, సుకుమార్, బం గారు, భీమ్రాజు, గోపాల్, జగన్‌గౌడ్, లక్ష్మణ్పవర్, రమేశ్‌నాయక్, సత్యనారాయణ, తిరుపతినాయక్, వెంకటేశ్ ఉన్నారు.
బాలానగర్‌లో..
బాలానగర్, అక్టోబర్ 15 : సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల, జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా లక్ష్మారెడ్డికి సీఎం కేసీఆర్ బీఫాం అందజేసిన సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ యూత్ వింగ్ మండలాధ్యక్షుడు సుప్ప ప్రకాశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా స్వీట్లు తినిపించుకున్నారు. కార్యక్రమంలో నాయకులు రవినాయక్, జగన్, చంద్రకాంత్, లింగం పాల్గొన్నారు.
నవాబ్‌పేటలో..
నవాబ్‌పేట, అక్టోబర్ 15 : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆదివారం సీఎం కేసీఆర్చేతుల మీదుగా జడ్చర్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా లక్ష్మారెడ్డి బీఫాం అందుకున్న శుభ సందర్భంగా మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పటాకులు కాల్చి మిఠాయిలు పంచి పెట్టారు. లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో జడ్చర్ల ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, సర్పంచ్ గోపాల్‌గౌడ్, బీఆర్ఎస్ యూత్వింగ్ మండలాధ్యక్షులు శ్రీను, నాయకులు నర్సింహులు, శివ, సంపత్‌కుమార్, జైపాల్‌రెడ్డి, రవీందర్, మణివర్మ, యాదయ్య పాల్గొన్నారు.