వనపర్తి టౌన్/ జడ్చర్ల/ మానవపాడు, ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయన అం దరివాడని, ఆదర్శప్రాయుడని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నా రు. మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొని అంబేద్కర్ విగ్రహా లు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వనపర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. దీంతో కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో రాజధాని నడిబొడ్డున అంబేద్కర్ స్ఫూర్తి విలసిల్లేలా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తే కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్ విగ్రహం చుట్టూ కంచె ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ను అవమానించిందని ఆరోపించారు. అదే విధంగా మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని, భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన మహోన్నతమైన వ్యక్తి అని ఆయనను అంద రూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
మానవపాడు మం డలం బోరవెల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కర ణ కార్యక్రమాన్ని నిర్వహించగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అదే విధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే లు మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎస్ రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో పా టు బీఆర్ఎస్ నేతలు పా ల్గొని ఆయన విగ్రహానికి, చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులర్పించా రు. కార్యక్రమాల్లో బీఆర్ఎ స్ కార్యకర్తలు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మహబూబ్‌నగర్ రూరల్ మండలం రామచంద్రాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణతోపాటు బీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
– పాలమూరు, ఏప్రిల్ 14