మహబూబ్‌నగర్, నవంబర్ 4 : గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్ లు తయారవుతున్నాయని.. నేను పోలీసు శాఖలో పనిచేసినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా.. అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. పోలీసుశాఖ ఇంత ఘోరమైన స్థాయికి దిగజారడం బాధగా ఉన్నదన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ నేత శ్రీకాంత్‌గౌడ్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆర్ఎస్పీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలనలో మా జీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కుటుంబం, శ్రీకాంత్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు నిదర్శనం జైలులో ఉన్న శ్రీకాంత్‌గౌడ్ అన్నారు.
2018లో ము గ్గురు దుర్మార్గులు దొంగ పట్టాలు సృష్టించి పేదలను మోసం చే శారని అప్పటి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కేసు పెట్టించారన్నారు. ఆ కేసును 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం కాపీ.. పేస్ట్ చేసి కొత్త కేసు పెట్టి ఆ ముగ్గురితోపాటు ఏ-4గా శ్రీకాంత్‌గౌడ్‌ను అన్యాయంగా కలిపారని ధ్వజమెత్తారు. పోలీసులు ఎలా కేసులు పెడుతుండ్రో చూడాల్సిన బాధ్యత హోం శాఖ మంత్రిదే..కానీ ఆ శాఖ సీఎం వద్దనే ఉందన్నారు. ప్రజల కోసం పనిచేసిన బీసీ నేతపై రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కూడబలుక్కొని కేసు నమో దు చేయించి జైలుకి పంపించారని ఆరోపించారు.
శ్రీకాంత్‌గౌడ్‌కు ఏమైనా హాని జరిగితే స్థానిక ఎమ్మెల్యేతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వరద భాస్కర్ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రశ్నించే పోస్టులు పెట్టినందుకు తెల్లవారుజామున అతడి ఇంటి నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొట్టడం సరికాదన్నారు. ఎందుకు కొట్టారని అడిగిన మా జీ మంత్రితోపాటు బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చే యడమేమిటన్నారు. పిస్తా హౌస్‌లో పనిచేసే వ్యక్తి చిన్నారిపై లైంగికదాడికి యత్నిస్తే పోలీసులు పట్టించుకోలేదని, దీంతో శ్రీనివాస్‌గౌడ్ పోలీస్ అధికారులతో మాట్లాడితే అప్పటికప్పుడు కేసు నమోదు చేశారన్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం.. కేటీఆర్, హరీశ్‌రావు నాయకత్వంలో నడుస్తున్న పార్టీ అన్నారు.
రా బోయే రోజుల్లో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో గులాబీ పార్టీ పా లన రాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. చ ట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన ఏ అధికారైనా చట్టం ముందు దోషిగా నిలబడాల్సిందేనని గుర్తుచేశారు. అంతకుముందు చిన్నారి తల్లిదండ్రులను ఆర్ఎస్పీ కలిసి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, సాట్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజయ్‌కుమార్, శ్రీ నివాస్యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహు లు, గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మాజీ ఎంపీపీ బాలరాజు, వరద భాస్కర్, జంబులయ్య ఉన్నారు.