అలంపూర్ చౌరస్తా, డిసెంబర్ 6 : ఉండవెల్లి మండలంలోని పుల్లూరు గ్రా మానికి చెందిన సంజన్న అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే విజయుడుతో కలిసి గ్రామానికి చేరుకొని సంజన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సంజన్న ఆర్ఎస్పీకి బంధువు కావడం తో ఎమ్మెల్యేతో కలిసి పాడె మోసి అం త్యక్రియల్లో పాల్గొన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే విజయుడు మండలంలోని కలుగొట్లకు చెందిన రాముడు అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రా మానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.