గద్వాల, డిసెంబర్ 8 : నియోజకవర్గంలో ని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల రోడ్లు ధ్వంసమై గుంతలమయంగా మారాయని, ప్రభుత్వం వెంటనే ఆధునీకరించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుర్వ విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని గద్వాల- అయిజ ప్రధాన రహదారిపై రాష్ట్ర నేత నాగర్‌దొడ్డి వెంకట్రాములు, బీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు కుర్వ పల్లయ్యతో కలిసి విజయ్‌కుమార్ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి పేరిట పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రె డ్డి రోడ్ల అభివృద్ధిని గాలికొదిలేశారన్నారు.
సొంత అవసరాలు, కాంట్రాక్టులు, పాత బి ల్లులు, క్రషర్కు ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకోవడాన్ని పక్కకు పెట్టి గద్వాల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. గుంతల మ యమైన రోడ్లపై వెళ్తూ ఎంతో మంది క్షతగాత్రులు కావడంతోపాటు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పా ర్టీ మారి ఆరు నెలలు గడిచినా ఒక్క రూపా యి కూడా తీసుకురాలేదన్నారు. ప్రజలతో క లిసి సమస్యలపై బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏడాది పాలనలో ఉమ్మడి జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కూడా నిధు లు కేటాయించలేదన్నారు. ఉమ్మడి జిల్లాపై ప్రేమ ఉంటే నిధులు కేటాయించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. కార్యక్రమంలో మక్బూల్, బీచుపల్లి, రవి, రాము, నర్సింహ, తిమ్మప్ప, మల్దకల్, గోవిందు, తిరుమలేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.