మక్తల్ టౌన్, జూన్ 18: రాష్ట్రంలో మంచినీటి కష్టాలనుతీర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మిషన్‌భగీరథ శాఖ ఆధ్వర్యంలో మక్తల్ మండలం పారేవుల పంప్‌హౌస్ వద్ద నిర్వహించిన మంచినీళ్ల పండుగకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో ఫ్లోరైడ్ నీటితో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికీ శుద్ధనీరు అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరధ పథకం చేపట్టారన్నారు. ఇంటింటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన మంచి నీళ్లు సరఫరా చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నారాయణపేట జిల్లావాసులు మంచి నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడేవారని, మిషన్ భగీరథతో కష్టాలు తీరాయన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ స్వచ్ఛమైన మంచి నీరు అందించడంతో 2022లో మిషన్ భగీరథ పథకానికి బెస్ట్ అవార్డు వచ్చిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ వనజ, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటరమణ, ఈఈ రంగారావు, జెడ్పీ సీఈఓ జ్యోతి, ఎంపీపీ వనజమ్మ, డీఈ మద్దిలేటి, ఏఈ నరేశ్, ఎంపీటీసీ ఆశిరెడ్డి, సర్పంచ్ వెంకటేశ్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అమరేంధర్రెడ్డి, మిషన్ భగీరథ సిబ్బంది ఉమాశంకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నర్సింహారెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
అపర భగీరథుడు సీఎం కేసీఆర్
ఊట్కూర్, జూన్ 18: మిషన్ భగీరథతో ఇంటింటికి శుద్ధ జలం అందించిన సీఎం కేసీఆర్ అపర భగీరథుడని సర్పంచ్ మాణిక్యమ్మ అన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా మండలంలోని మల్లేపల్లిలో ఆదివారం మంచి నీళ్ల పండుగ నిర్వహించారు. ఈసందర్భంగా ఓవర్‌హెడ్ ట్యాంక్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ సీఎం నేతృత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఒకప్పుడు కడివెడు మంచినీళ్ల కోసం గోస పడ్డామని ప్రస్తుతం ఇంటింటికీ మంచి నీటి పథకం ద్వారా తాగు నీటి ఇబ్బందులు తొలగి గ్రామాల్లో మహిళలు సంతోషంగా జీవనం గడుపుతున్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు మహిళాలోకం రుణపడి ఉంటుందన్నారు. అనంతరం మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలస్వామి, వార్డు సభ్యులు వెంకటప్ప, తాయప్ప, కతలప్ప, అంజప్ప మహిళా సంఘా ల సభ్యులు శ్రీశైలమ్మ, కిష్టమ్మ, పద్మమ్మ పాల్గొన్నారు.
మిషన్ భగీరథ నీళ్లే తాగాలి
ధన్వాడ, జూన్ 18: మార్కెట్లో లభించే మినరల్ వాటర్ కంటే మిషన్ భగీరథ నీటిలోనే ఎక్కువ మినరల్స్ ఉంటాయని అందువల్ల ప్రతి ఒక్కరూ భగీరథ నీటినే తాగాలని మిషన్‌భగీరథ పథకం ఎస్ఈ వెంకటరమణ సూచించారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన మంచినీటి పండుగకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోదాం సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద పూజలు నిర్వహించారు. ఆంతకు ముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన మంచినీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన మిషన్పథకం ద్వారా నారాయణపేట జిల్లాలోని 419 గ్రామాలకు మంచినీళ్లు అందుతున్నాయని తెలిపారు. సర్పం చ్ అమరెందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు తాగునీటి కోసం నిత్యం రాస్తారోకోలు, ధర్నాలు చేసేవారన్నారు. గతంలో ధనవంతులకే పరిమితమైన స్వచ్ఛమైన తాగునీరు ప్రస్తుతం ప్రతి ఇంటికీ అందుతున్నాయన్నా రు. ఈ సందర్భంగా మహిళలను సర్పంచ్ అమరేందర్ రెడ్డి సన్మానించారు. అనంతరం సర్పంచ్‌ను ఆశ కార్యకర్తలు సన్మానించారు. మండలంలోని గోటూర్ లో మంచినీళ్ల పండుగను పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఏఈ ఉదయ్‌కుమార్, ల్యాబ్‌టెక్నీషియన్ రవి, సర్పంచులు నారాయణరెడ్డి, సుగు ణ, సువర్ణ, దామోదర్‌రెడ్డి చంద్రకళ, రాములు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మంచినీళ్ల పండగ
కృష్ణ, జూన్ 18 : మండలంలోని మురహరిదొడ్డిలో సర్పంచ్ దేవేంద్రప్ప ఆధ్వర్యంలో మంచినీళ్ల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మంచినీళ్ల కోసం రెండు కిలోమీటర్ల దూరం నడిచి వాగులు, వంకల్లో చెలిమలు తవ్వుకొని నీళ్లు తెచ్చుకొనే పరిస్థితి ఉండేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇస్తూ నీటి కష్టాలు తొలగించారన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ తిమ్మప్ప, ఆశ కార్యకర, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్దలో..
దామరగిద్ద, జూన్ 18: మండల కేంద్రంతో పాటు ఉడ్మల్గిద్ద, బాపన్‌పల్లి, దేశాయిపల్లి, లింగారెడ్డిపల్లి, కందెన్‌పల్లి, చాకలివారిపల్లి గ్రామాల్లో మంచినీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో మంచి నీటి సరఫరా సిబ్బందిని ఎంపీపీ బక్క నర్సప్ప సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు వన్నడి ఆశమ్మ, విశాలాక్షి, సత్యమాతిప్పన్న, అశోక్, ఆర్డబ్ల్య్లూఎస్ ఏఈ, వార్డు సభ్యులు సంజీవరెడ్డి, కార్యదర్శి రాజయ్యగౌడ్, నాయకులు వన్నడి చంద్రకాంత్, ప్రహ్లాద్గౌడ్, భీంరెడ్డి, శరణప్ప, గ్రామస్తులు పాల్గొన్నారు.
నర్వలో..
నర్వ, జూన్ 18 : మండలంలోని అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో మంచినీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని మాట్లాడుతూ గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే కరువు మండలాల్లో నర్వ మొదటిస్థానంలో ఉండేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిరంతర కృషితో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన మంచినీళ్లు అందడంతోపాటు మండలంలో ప్రతి ఎకర సాగులోకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జయరాములుశెట్టి, వైస్‌ఎంపీపీ వీణావతి, సర్పంచులు గౌరమ్మ, సుజాత, శివన్న, అరవింద్‌రెడ్డి, నెల్లూరి పావని తదితరులు పాల్గొన్నారు.
మాగనూర్‌లో..
మాగనూర్ జూన్ 18: మండలంలో మంచినీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంచినీటి ట్యాంకులకు మామిడి తోరణాలుకట్టి ముగ్గులు వేసి ర్యాలీలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్యామలమ్మ, జెడ్పీటీసీ వెంకటయ్య, సింగిల్ విండో చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.