జడ్చర్ల టౌన్, నవంబర్ 1 : జడ్చర్ల మున్సిపాలిటీ కమిషనర్, చైర్పర్సన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు మండిపడ్డారు. శనివారం జడ్చర్ల ము న్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశాన్ని బీఆర్ఎస్ కౌన్సిలర్లు బహిష్కరించి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న పనులకు సంబంధిత కౌన్సిలర్లకు సమాచారం లేకుండా ఏకపక్షంగా కమిషనర్, చైర్పర్సన్ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
మున్సిపల్ నిధులను కేవలం కాంగ్రెసోళ్లు చెప్పిన వార్డుల్లోనే పనులకు వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ జనరల్ బాడీ సమావేశానికి సంబంధించి ఎజెండాను కౌన్సిలర్లకు సమాచారం లేకుండానే తయారు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లా వ్యవహరిస్తున్న మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్లకు తెలియకుం డా కాంగ్రెస్ నాయకులు చెప్పిన ట్లు ఎజెండా ఎలా తయారు చేస్తారని కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్లకు తెలియకుం డా జేసీబీ పెట్టి రూ.15లక్షల బిల్లు చేయడం ఏమిటని ప్రశ్నించారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో రూ.3కోట్లు పనులు చేసినా కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వలేదన్నారు. కమిషనర్ ప్రోటోకాల్ పాటించటం లేదని ఆరోపించారు.
పట్టణంలో అక్రమ ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నట్లు కమిషనర్ దృష్టికి తెచ్చినా పట్టించుకోవటం లేదన్నారు. మైనార్టీలు నివసిస్తున్న ప్రాం తాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదని చెప్పారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డిని వివరణ కోరగా.. జనరల్ బాడీ సమావేశానికి కౌ న్సిలర్లు కొందరు గైర్హాజయ్యారని, అలాగే ఎజెండాలోని అంశాలపై కొందరు అభ్యంతరాలు తెలపడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో లక్ష్మి, రఘురాంగౌడ్, నందకిశోర్‌గౌడ్, సారిక, లత, నవనీ త, ప్రశాంత్‌రెడ్డి, ఉమాశంకర్‌గౌడ్, సతీశ్, చైతన్యగౌడ్ తదితరులు ఉన్నారు.