KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాలు, ప్రధాన కూడళ్లలో బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపాయి. ప్రధాన కూడళ్లల్లో కేక్కట్చేసి పటాకులు పేల్చి, స్వీట్లు తినిపంచుకున్నారు. పలు ప్రాంతాల్లో ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
వనపర్తిలో..
వనపర్తిలోని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వగృహంలో కేసీఆర్ బర్త్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి,యువజన,సోషల్ మీడియా ప్రతినిధులు సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వనపర్తి పట్టణంలో పి.రమేశ్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మొక్కలు నాటారు. అంతకుముందు ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశారు. పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం నాయకులు, కార్యకర్తల సమక్షంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మహమ్మాదాబాద్లో..
మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు భిక్షపతి, మాజీ సర్పంచులు గీతా పాండు నాయక్, వెంకట్ రాంరెడ్డి, నీలేశ్ నాయక్, బాలాజీ రాజేశ్వర్, గోవర్ధన్ రెడ్డి, అశోక్ రెడ్డి, సాబెర్, శ్రీనివాస్, సూర్య నాయక్, రాజు గౌడ్, రాంరెడ్డి, ఆంజనేయులు, చెన్నయ్య ఆయా గ్రామాల కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
దేవరకద్రలో..
దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్ యాదవ్, మున్నూరు బాలరాజు, మూడా మాజీ డైరెక్టర్ కర్ణం రాజు, నాయకులు చల్మారెడ్డి ఉప్పరి సత్యం సాగర్, సయ్యద్ గౌస్, బండ హన్మి రెడ్డి, కేంగురి యాదయ్య, రవితేజ,భార్గవ్, నవీన్,అస్నుద్దీన్, ఎండి మజార్, బాల్ రాజు, శాలి ఆంజనేయులు ఉషన్న, జగన్ మరియు ఆయా గ్రామాల ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వీపనగండ్లలో..
వీపనగండ్ల మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకుని సంబరాలు నిర్వహించుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, ముంత మల్లయ్య యాదవ్, నారాయణరెడ్డి, నరేందర్, విష్ణు, రాము, రామచందర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణ మండలంలో
కృష్ణ మండలంలోని శ్రీ సద్గురు క్షీరలింగేశ్వర స్వామి ఆలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కృష్ణ మండల బీఅర్ఎస్ యువ నాయకుడు శివరాజ్ పాటిల్ కేక్ కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.