దేశవ్యాప్తంగా రైతులందరినీ ఏకం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతు రాజ్యమే బీఆర్ఎస్ లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడంతో బీజేపీ గుండెల్లో గుబులు మొదలైందన్నారు. గురువారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కర్ణాటక లోక్ జనశక్తి (పాశ్వాన్) రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఎల్జేపీ కర్ణాటక యువజన అధ్యక్షుడు నారాయణ కర్ణి, న్యాయవాది శేఖర్గౌడ, గణేశ్ యాదవ్,వీరేశ్‌రెడ్డి, గణేశ్ తదితరులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ అన్న నినాదం కమలం పార్టీ నేతలకు చెమటలు పట్టిస్తుందన్నారు.
వనపర్తి, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : రైతు రాజ్యమే భారత రాష్ట్ర సమితి లక్ష్యమని, ఇందుకోసం దేశంలో రైతులందరినీ ఏకం చేస్తామని వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడంతో బీజేపీ పునాదులు కదలడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. గురువారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కర్ణాటక లోక్ జనశక్తి (పాశ్వాన్) రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఎల్జేపీ కర్ణాటక యువజన అధ్యక్షుడు నారాయణ కర్ణి, న్యాయవాది శేఖర్గౌడ, గణేశ్ యాదవ్, వీరేశ్‌రెడ్డి, గణేశ్ తదితరులు మంత్రిని కలిశా రు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ నినాదం బీజేపీకి చెమటలు పట్టిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రైతు నినాదంపై చర్చ మొదలైందని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించాం.. ఎనిమిదేండ్లలో తెలంగాణ అభివృద్ధిని చేసి ఆదర్శంగా నిలిపామన్నారు. కేసీఆర్ తెలంగాణ దాటితే త మ ఉనికికే ఎసరు వస్తుందని కమలం పార్టీ నేతలు భయపడుతున్నారని విమర్శించా రు. తెలంగాణ అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తూ, నిధులకు మోకాలడ్డుతున్న కేంద్రంపై దుమ్మెత్తిపోశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా తెలంగాణ అభివృద్ధిని ఎవరూ ఆపలేరన్నారు.
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. త్వ రలో కర్ణాటకలోని రాయిచూర్ వేదికగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరికల జోరు ఉండబోతున్నదని చెప్పారు. ఇందుకోసం ఏర్పాట్లు చేసుకోవాలని వారికి సూచించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి స్వయంగా హాజరవుతానని వెల్లడించారు.