బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ విచారణ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ ఆందోళనలు హోరెత్తాయి. ఆదివారం మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్క ర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లా కేంద్రాలతోపాటు పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో నిరసనలు మిన్నంటాయి.

ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల జెండాలతో ర్యాలీలు నిర్వహించి సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. కార్యక్రమాల్లో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా, మండల నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



సిట్ విచారణ అనంతరం కేసీఆర్‌ను కలిసి మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దర్‌రెడ్డి

కొల్లాపూర్ ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి

మక్తల్‌లో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం బీఆర్ఎస్ నేతలు

కొత్తకోటలో లో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

నాగర్‌కర్నూల్ ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి

గద్వాల ర్యాలీలో పాల్గొన్న హనుమంతునాయుడు, ఆంజనేయగౌడ్

బైక్ ర్యాలీలో పాల్గొన్న కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్