అలంపూర్ చౌరస్తా, డిసెంబర్ 6 : దేశానికి రాజ్యాంగాన్ని అం దించిన మహనీయుడు డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ అని ఎమ్మెల్యే విజయుడు అన్నా రు. శుక్రవారం అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని అలంపూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూ లమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా సామాజిక సామరస్యానికి కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు.
దళిత కుం టుబం నుంచి వచ్చి అణగారిన వర్గాలకు చెందిన ప్రజల ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడంతో భారత రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిగా నిలిచారన్నారు. అంబేద్కర్ గొప్ప ఆర్థికవేత, న్యాయనిపుణుడు, రాజకీయవేత్త, సంఘ సంస్కర్త అని, ఆయన జీవితాంతం దళిత జాతి సంక్షేమం, స్వేచ్ఛ కోసం కృషి చేశారని వెల్లడించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.