తిమ్మాజిపేట, మే 2 : తండ్రి సమక్షం లో కాల్వలో ఈత నేర్చుకుంటున్న బాలుడు తాను కట్టుకు న్న ట్యూబ్ ఉడిపోవడంతో నీట మునిగి మృతిచెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో గుమ్మకొండ సమీపంలో పాలమూరు-రంగారెడ్డి ప్రధాన కాల్వలో శనివారం చోటు చేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం గుమ్మకొండ గ్రామానికి చెందిన ఖదీర్ కుటుంబంతో తిమ్మాజిపేటలో స్థిరపడ్డాడు.
తన ముగ్గురు కుమారులకు ఈత నేర్పడానికి గుమ్మకొండ సమీపంలోని పాలమూరు కాల్వ వద్దకు వెళ్లా డు. ముగ్గురికి ట్యూబ్లు వేసి నీటిలో దింపగా పెద్దకుమారుడు సమీర్ (15) నీటిలో ఈదుతుండగా ట్యాబ్ ఉడిపోవడంతో నీట మునిగాడు. ఇద్దరు కుమారుల వద్ద ఉన్న తండ్రి తేరుకునే లోపే సమీర్ నీటమునిగిపోయాడు. నీరు అధికంగా ఉండటంతో స్థానికుల సహాయంతో బాలుడిని వెలికితీయగా అప్పటికే సమీర్ మృతి చెందాడు. సమీర్ ఇటీవలే పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైనట్లు స్థానికులు తెలిపారు. కండ్ల ముందే కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రుల రోధనలు అందరిని కంటతడిపెట్టించాయి.