గద్వాల, జూలై 1 : ఫిట్నెస్ లేని గద్వాల డిపో బస్సులతో ఇటు ప్రయాణి కులు, అ టు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఈ విషయం పాలకులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. నిత్యం ఏదో ఒక చోట గద్వాల డిపోకు చెందిన బస్సులు వివిధ సాంకేతిక కారణాలతో మధ్యలో ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
మంగళవారం గద్వాల డిపో నుంచి రాయిచూర్ కు బయలు దేరిన గద్వాల డిపో బస్ స ంగాల చెరువు సమీపంలో సాంకేతిక లో పం నిలిచి పోయింది. ప్రయాణికులు తమ పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంతో పాటు విద్యార్థులు కళాశాల, పాఠశాల ముగించుకొని సొంత గ్రామాలకు వెళ్లే క్రమంలో బస్సు రిపేరు వచ్చి నిలిచి పోవడం, అదే సమయంలో ముసురు వర్షం పడడంతో రిపేరుకు అంతరాయం ఏర్పడింది.
దీంతో బస్లో ఉన్న విద్యార్థులు, ప్రయాణికులు వర్షంలోనే అటు వైపు వెళ్లే వాహనదారులను లిఫ్ట్ అడిగి వెళ్లి పోతుండగా, మరి కొంత మంది విద్యార్థులు తమ గమ్యం చేరుకోవడానికి ఆలస్యమవుతుండడంతో ప్రైవేట్ వాహనదారులను లిఫ్ట్ అడిగి ఇండ్లకు చేరుకున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఆర్టీసీ అధికారులు స్పందించి దూరం వెళ్లే బస్సులను ఫిట్ నెస్ ఉండే బస్సులను వేయాలని ప్రయాణికులు, విద్యార్థులు కోరుతున్నారు.