చేపా చేపా ఎప్పుడొస్తావ్ అంటే.. ఏమో వానలు కురిసినప్పుడంటే.. ఇప్పుడు వానలు కురుస్తూనే ఉన్నాయ్ కదా.. మరెప్పుడొస్తావంటే.. వస్తా.. వస్తా అన్నట్లుగా తయారైంది.. వంద శాతం చేప పిల్లల పంపిణీ పథకం. కులవృత్తులను కాపాడటం, ఆ వృత్తిదారులకు ఆర్థికంగా చేయూతను అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాలకు కాంగ్రెస్ సర్కారు మంగళం పాడింది. ఈ క్రమంలో మత్స్యకారుల కోసం అమలైన చేప పిల్లల పథకం అమలవుతుందా..? లేదా అన్న అయోమయం మత్స్యకారుల్లో నెలకొన్నది. చేపల పెంపకంతో నీలివిప్లవం సృష్టించాలని భావించిన పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రతి సంవత్సరం శ్రీశైలం రిజర్వాయర్‌తో పాటుగా ఐదు రిజర్వాయర్లు, 13 వందల చెరువుల్లో 2 కోట్లకుపైగా చేప పిల్లలను విడుదల చేశారు. చేపలతో ఉపాధి పొందే మత్స్యకారులు ఈ పథకంపై ప్రభుత్వ విధాన నిర్ణయం కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ పథకాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం తమను అన్ని విధాలా ఆదుకున్నదని చెప్పుకొచ్చారు.
వందశాతం సబ్సిడీతో చేప పిల్లలను కేసీఆర్ ప్రభుత్వం పంపిణీ చేసి మత్స్యకారులకు ఆర్థికంగా చేయూతనిచ్చింది. ఈ పథకం ద్వారా ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ప్రభుత్వ మే వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను అందజేసింది. చేపల పెంపకంలో తెలంగాణ నీలి విప్లవాన్ని సృష్టించింది. మిషన్ కాకతీయ పథకంతో చెరువులను పునరుద్ధరించడం, ఎంజీకేఎల్ఐ సహా పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో నీటి వనరుల లభ్యత పెరిగింది. చేప పిల్లలను ఉచితంగా అందజేయడంతో చేపల లభ్యత పెరిగి మత్స్యకారులు ఆర్థికంగా లబ్ధి పొందారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల చెరువులు, కుంటలు, జలాశయాల్లో నాటి మంత్రులు, ఉన్నతాధికారులు సహా ప్రజాప్రతినిధులంతా చేప పిల్లలను విడుదల చేశారు. ఇదంతా ప్రతి ఏడాది పండుగ వాతావరణంలో జరిగేది. దీనివల్ల వర్షాకాలంలోనో, అప్పుడెప్పుడో దొరికే చేపలు నేడు నాగర్కర్నూల్లాంటి ప్రాంతాల్లో రోజూ దొరుకుతున్నాయి. ఇది స్థానికంగా మత్స్యకారులు, హోటళ్ల నిర్వాహకులకు లాభం కల్పించడంతో పాటుగా చేపాహార ప్రియులకూ సంతోషాన్ని ఇస్తోంది. అలాంటి ఈ పథకం అమలు ఇప్పు డు సందేహంగా మారింది. అలాంటి ఈ పథకం అమలుపై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకున్నాయి. వర్షాలు పడుతున్నా ఇంకా పంపిణీ పై క్లారిటీ రాకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
చేపలు పెరగాలంటే జూన్‌లో చేప పిల్లల టెండర్ల ప్రక్రియను ప్రారంభించాల్సి ఉన్నది. కానీ ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీ సుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. దీనిపై మత్స్యశాఖ అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. ఓ చేప పిల్ల కిలో సైజు పెరగాలంటే నెలల సమయం పడుతుంది. జూలై, ఆగస్టు నెలల్లో చేప పిల్లలు వదిలితే డిసెంబర్ లేదా జనవరిలో పట్టుకొని విక్రయించుకునేందుకు వీలుగా ఉంటుంది. చేప పిల్లలు ఆలస్యంగా వదిలితే ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. సెప్టెంబర్‌లో చేప పిల్లలు వదిలితే అవి ఎదగడానికి ఫిబ్రవరి వర కు సమయం పడుతుంది. ఇంకా పెరగాలంటే ఏప్రిల్, మే నెలలో వస్తాయి. ఈ నెలల్లో అధిక ఎండలతో చెరువుల్లో నీరు ఇంకి చేపలు చనిపోయే అవకాశం ఉంటుంది. మత్స్యకారులు పూర్తి నీటితో ఉండే చెరువుల్లో 45రోజుల వ యస్సతో ఉన్న 35-40 మిల్లీ మీటర్ పొడవు న్న చేపలను పెంచుతారు. అలాగే ఏడాది మొ త్తం నీళ్లుండే ప్రాజెక్టులు, పెద్ద చెరువుల్లో 75 రోజుల వయస్సున్న 80 నుంచి 100 మిల్లీ మీటర్ల పొడవున్న చేపలను పెంచుతారు.
చేప పిల్లల టెండర్ల ప్రక్రియ గురించి ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. నాగర్‌కర్నూల్ జిల్లాలో దాదాపు 2 వేల చెరువులు ఉన్నాయి. గ తంలో చేప పిల్లల పంపిణీకి సంబ ంధించి కార్యాచరణను ప్రభు త్వానికి నివేదించాం. సర్కారు నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. అప్పుడే చేప పిల్లల పంపిణీ ఉంటుంది.