మరికల్, జూన్ 05 : రైతుల భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని, ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తాసిల్దార్ రామ్ కోటి, డీటీ బీబీ హజ్రా రైతులకు సూచించారు. గురువారం మరికల్ మండలంలోని ఇబ్రహీంపట్నం, కన్మనూర్ గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుండి దరఖాస్తులను స్వీకరించి వారికి రసీదులను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సుధాకర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్లు విష్ణు, చరణ్, రమేష్, మురళీధర్ గౌడ్, తో పాటు రెవెన్యూ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.