ధన్వాడ/బాలానగర్, సెప్టెంబర్ 26 : ‘దేవుడు వరమిచ్చినా.. పూజారి కనికరించని’ చందంగా ఉంది ధన్వాడ పోస్టల్ శాఖ అధికారుల తీరు. ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్ల కోసం నాలుగు రోజుల కిందటే డబ్బులు అందించింది. అయితే పోస్టల్ అధికారులు నిర్లక్ష్యంగా నిత్యం కొద్దిమందికే అందిస్తుండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
గురువారం ధన్వాడలో వం దల సంఖ్యలో లబ్ధిదారులు రావడంతో పింఛన్లు తీసుకునేందుకు వృద్ధులు, ది వ్యాంగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. అలాగే బాలానగర్ మం డలం గుండేడులోని వృద్ధులు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి నెలా 5వ తేదీన డబ్బులు అందేవని, ప్రస్తుతం 20 రోజులు దాటినా పింఛన్ చేతికి అందడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.