కొల్లాపూర్ రూరల్, ఏప్రిల్ 9 : వరంగల్‌లో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 27 బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్‌లో కేసీఆర్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఉంటుందని, ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరానున్నారని చెప్పారు.
రాష్ట్రంలో ప్రతిగ్రామంలో ప్రజలు నేడు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. నేను ఇప్పటి దాకా కొన్ని గ్రామాల్లోకి వెళ్లగా అక్కడ ప్రజలు కేసీఆర్ ఉండగా సాగు నీరు , తాగు నీరు సక్రమంగా ఉండడంతోపాటు 24 గంటలు కరెంట్ ఇచ్చేదని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చినా వాటిని అమలు చేయడంతో ఘోరంగా విఫలమైందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని, తెలంగాణ రాష్ట్రం అబ్భివృద్ధి, సంక్షేమం జరగాలన్నా ఇంటి పార్టీ మాత్రమే ఉండాలని తెలంగాణ ప్రజలు గుర్తించారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్కు వందశాతం మంచి రోజులు రానున్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలో వివిధ మండలాలో బిఆర్ఎస్ పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నాం ప్రతి మండలం, గ్రామం నుంచి భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు , ఆభిమానులు ,భారీగా తరలి వచ్చి సభ ను విజయవంతంగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు.కార్యక్రమంలో నాయకులు నరేందర్‌రెడ్డి , కాటం జంబులయ్య, కల్లమంద శేఖర్ , ఎండీ రుక్మద్దీన్, నిరంజన్, దార శేఖర్, నాగరాజు, బోరెల్లి కురుమయ్య, కలర్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.