పాన్‌గల్, ఏప్రిల్ 5 : రామన్నగట్టు రిజర్వాయర్ నిర్మాణంతోనే శాశ్వత సాగునీటి పరిష్కారం అవుతుందని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొల్లాపూర్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఆలవెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు.ఆదివారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాన్‌గల్ మండలంలోని కిష్టాపూర్ వద్ద రామన్నగట్టు రిజర్వాయర్ నిర్మాణంకోసం రూ.500కోట్ల నిధులు మం జూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంజూరును నిలిపివేసిందన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభు త్వం కేసీఆర్ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపాదికన చేపట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు సాగునీటి అందించడంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. గోపల్‌దిన్నె..సింగోటం లింక్ కెనాల్ అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. జలవిద్యుత్ పేరిట శ్రీశైలంలో సాగునీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోచుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. ఇరిగేషన్‌మంత్రి, జిల్లా మంత్రి ఎందు కు అడ్డుకోలేకపోయారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో మంజూరైన వాటిని రద్దు చేశారని, మధ్యంతరంలో ఉన్న పనులను పూర్తి చేయడంలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వహయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రా జెక్టు పనులు 90శాతం పూర్తి చేస్తే రెండున్నర కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన 10శాతం పనులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
రూ.150కోట్ల గోపల్‌దిన్నె సిం గోటం లింక్కెనాల్ను గుత్తేదారు అయిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పనులను ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. ఓట్లప్పుడే రాజకీయాలు తప్పా మిగతా సమయంలో అభివృద్ధిపై దృష్టి సారించేలా నాయకుల పనితీరు ఉండాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెబ్బేటి వీరసాగర్, మాజీ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జ్యోతినందన్‌రెడ్డి, చం ద్రశేఖర్నాయక్, అడ్వకేట్ రవి, రాజేశ్‌రెడ్డి, తిలక్‌గౌడ్, భాస్కర్‌రెడ్డి, దశరథ్ నాయుడు, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గోపాల్పేట/ఏదుల, ఏప్రిల్ 5 : ఏదుల మండంలోని గొల్లపల్లి, చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం ప్రతిపాదన వ్యతిరేక పోరాట సమితి నాయకులు చేస్తున్న దీక్షలకు సంఘీభావంగా ఈ నెల 9వ తేదీన మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఏదుల మండలానికి వస్తున్నారని, దీక్షా శిబిరం వద్ద నిర్వహించే సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన గోపాల్పేట, బుద్ధారం, ఏదుట్ల గ్రామంలో బీఆర్ఎస్ నాయకులతో సభ సన్నాహక సమావేశం నిర్వహించి మండలం నుంచి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు వేలాదిగా సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
గొల్లపల్లి,చీర్కపల్లి రిజర్వాయర్ ప్రతిపాదనను ప్రజా ధనాన్ని దోచుకునే ప్రయత్నంగా అభివర్ణించారు. దీనికి వ్యతిరేకంగా రైతులు 98రోజులుగా దీక్ష కొనసాగిస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, 11 డిక్లరేషన్లు, 420 హామీలు అమలు గురించి ప్రజలకు స్ప ష్టత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్మెంట్ తర్వాత ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కూడా అందజేయట్లేదన్నారు. త్వరలో జరుగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండి కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.
హరీశ్‌రావు పర్యటను విజయవంతం చేయడం ద్వారా రైతుల ఉద్యమానికి బలం చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పలుస శేఖర్‌గౌడ్, హనుమంత్ నాయక్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ హర్యానాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లెద్దుల బాల్‌రాజు, గ్రామ అధ్యక్షుడు గుండ్రాతి రాజేశ్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు అడ్డాకుల తిరుపతి యాదవ్, గోపాల్, నాగరాజు, జహంగీర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 9వ తేదీన హరీశ్‌రావు నిర్వహించే సభాస్థలిని ఆదివారం మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గొల్లపల్లి, చీర్కపల్లి రైతుల దీక్షలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. హరీశ్ రావు పర్యటనతో రైతుల సమస్యలు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతాయని, వారికి న్యాయం జరిగే దిశగా ఈ సభ కీలకంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.