వనపర్తి, జూలై 10(నమస్తే తెలంగాణ) : నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ గుండాలు చేస్తున్న దౌర్జన్యాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. అధికారం ముసుగులో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాడులను ఎంత మాత్రం సహించబోమని బీరం పేర్కొన్నారు. గురువారం చిన్నంబావి మండలం చిన్నమరూరులోమూడు రోజుల కిందట కాం గ్రెస్ మూకలు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన బీఆర్ఎస్కు చెందిన మాజీ ఉపసర్పంచ్ బాలపీరు, కార్యకర్త కురుమయ్యను మాజీ ఎ మ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్భంగా బీరం మా ట్లాడుతూ పొలం పనులు చేసుకుంటున్న వీరిని దారుణంగా మారణాయుధాలతో కాంగ్రెస్ రౌడీ లు హత్యాయత్నానికి ప్రయత్నించారన్నారు.
వీరి దాడిలో తలకు 20 కుట్లు పడ్డాయని, ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డారన్నారు. దాడిపై చిన్నంబావి పోలీసులను బాధితులు ఆశ్రయించినప్పటికీ వారి సహాయ నిరాకరణ జరిగిందని, న్యాయం చేయాల్సిన పోలీసులు బాధితులపైనే దురుసుగా ప్రవర్తించడం చూస్తే.. అధికార పార్టీకి పోలీసులు కొమ్ముకాస్తున్నారన్నది బహిరంగంగా కనిపిస్తున్నదని బీరం పేర్కొన్నారు. కాంగ్రెస్ వర్గాలు చేస్తున్న దాడులపై పోలీసులు న్యాయం చేయని పక్షంలో పోలీసు స్టేషన్ల ఎదుట ధర్నాలకు దిగుతామని, బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు.
చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో శ్రీధర్‌రెడ్డి హత్యలో దోషులను ఇప్ప టి వరకు అరెస్ట్ చేయలేదని, వరుసగా మండల గ్రామాల్లో కాంగ్రెస్ దౌర్జన్యాలకు పాల్పడుతుండడం సరైందికాదన్నారు. దాడుల సంస్కృతి మంచిది కాదని, ఇది ఎంతకాలం సాగబోదని, అధికారం ఎవరికి ఎప్పటికీ శాశ్వతం కాదన్నది గుర్తెరిగి మసలుకోవాలని హితవు పలికారు. బీరం వెంట మాజీ ఎంపీపీ సోమేశ్వర మ్మ, మాజీ సర్పంచులు శ్రీధర్ రెడ్డి, మధు, సీనియర్ నాయకులు శివారెడ్డి, కృష్ణయ్య, రాజు, బాబు, శ్రావణ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
పాన్‌గల్, జూలై 10 : ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపిచ్చారు. గురువారం మండలంలోని జమ్మా పూర్ గ్రామంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టుల విషయం లో బీఆర్ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులపై కాంగ్రెస్ నాయకులు లేనిపోని నిందలు మోపి అక్రమ కేసులు పెడుతున్నారని, రాను న్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు భాస్కర్‌రెడ్డి, కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్‌నాయక్, వెంకటయ్యనాయుడు, అడ్వకేట్ రవికుమార్, జ్యోతినందన్‌రెడ్డి, వీరసాగర్, నరసింహానాయుడు ఉన్నారు.