పెంట్లవెల్లి, ఏప్రిల్ 9 : ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేసి అధికాంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను గాలికొదిలేసిందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం పెంట్లవెల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యాకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెంట్లవెల్లి మండలం నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించి సభను విజయవతం చేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే 100రోజుల్లో ఆ రు గ్యారంటీలను అమలు చేస్తామని చేప్పిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వం ఏర్పడి ఎడాదిన్నర గడిచినా ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలుకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. మార్పు, మార్పు అంటూ… రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ర్టాని నాశనం చేస్తున్నారన్నారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి రైతులను రాజును చేస్తే.. నేడు కాంగ్రెస్ సర్కార్ సంక్షేమ పథకాలను తు ంగలో తొక్కిదన్నారు. పైగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు రైతులకు బేడీలు వేసి కేడీలను చేసి.. జైలుకు పంపిందన్ని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు.
పెంట్లవెల్లి సొసైటీలో రుణాలు తీసుకున్న రైతులనుద్దేశించి మాట్లాడుతూ.. ఆగస్టు15 వరకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని ప్రగాల్బాలు పలికిన సీ ఎం నేటి వరకు 50శాతం మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. సమావేశం లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతుల వేంకటేశ్వర్లు, విండోచైర్మన్ విజయరామారావు, మండల సీనియర్ నాయకులు రాజేశ్, సురేందర్‌గౌడ్, నరేందర్‌రెడ్డి, ఎస్కే ఖాజా, గోవురాజు, యాగౌస్, బ్ర హ్మం, వేంకటేశ్, రామచందర్, కురుమయ్య, బాలస్వామి, రాము, శేఖర్ తదితరులు ఉన్నారు.