మహబూ బ్‌నగర్, మే 14 (నమస్తే తె లంగాణ ప్రతినిధి) : పర్యాటక జిల్లా పాల మూ రులో వివిధ దేశాల సుందరీ మణులు సందడి చేయ నున్నారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పిల్లల మర్రికి ప్రపంచ సుందరీమణులు వస్తుండ డంతో పాలమూరుకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. దాదాపు 750 ఏండ్లకుపైగా పురాతనమైన పిల్లలమర్రికి అంత ర్జాతీ య ఖ్యాతి లభించినట్లయ్యింది. 10 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీలకు రాజ ధాని హైదరాబాద్ వేదికగా మా రింది.
ఈ పోటీల్లో పాల్గొనే వివి ధ దేశాలకు చెందిన 22 మంది సుందరీమణులు 16వ తేదీన మహబూబ్‌నగర్ సమీపంలోని పిల్లలమర్రి పర్యాటక ప్రాం తాన్ని సందర్శించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రసిద్ధ మహా వృక్షం వద్దకు రానున్నా రు. పిల్లలమర్రితోపాటు అక్కడే ఉన్న పురావస్తు మ్యూజియం, రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని వారు సందర్శించనున్నారు. వీరికి స్వాగత ఏర్పా ట్లు పూర్తి చేశారు. ఇందుకోసం పోలీస్, రెవెన్యూ యంత్రాంగం భద్రతా ఏర్పాట్ల ల్లో నిమగ్నమైంది. అత్యంత భారీ భద్రత మధ్య వీరి పర్యటన కొనసాగనున్నది.
ఇప్పటికే కలెక్టర్ విజయేందిరబోయి నేతృ త్వంలో అధికారులు ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. భద్రతా చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పిల్లలమర్రి ప్రాంతాన్ని పోలీసులు వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవరోధాలు లేకుండా ఊడల మర్రిని చూపించి మరపురాని ఆతిథ్యం ఇవ్వన్నట్లు కలెక్టర్ ప్రకటించారు. అతి థులకు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పూర్తి చేయనున్నారు. రెండ్రో జుల నుంచి సందర్శకులను పిల్లలమర్రిలోకి అనుమతించడం లేదు. కాగా ఉమ్మడి జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూ స్తున్నారు. కానీ ప్రజలకు, సందర్శకులకు ఎలాంటి అనుమతిని లేదని అధికారులు చెబుతున్నారు.
భారీ బందోబస్తు
మహబూ బ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని పిల్లలమర్రి పర్యాటక ప్రాం తాన్ని అందాల భామలు సంద ర్శించనుండడంతో మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో బం దోబస్తును పర్యవేక్షిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లపై దగ్గ రుండి సమీక్షిస్తున్నారు. అత్యంత ప్రతి ష్టాత్మకంగా తీసుకొని మూడు స్థాయిల భద్రతను ఏర్పాటు చేయ నున్నట్లు ఆయన తెలిపారు. సుమారు వెయ్యి మంది పోలీసులు నియమించినట్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి మహ బూబ్‌నగర్ వరకు ట్రాఫిక్‌కు అంతరాయం తలెత్తకుండా పోలీసులు జాతీ య రహదారి-44ను నాకాబంది చేపట్టనున్నారు.
పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ విజ యేందిరబోయి సంబంధిత అధికారులతో కలిసి సమిష్టిగా పర్యవేక్షి స్తున్నారు. పటిష్ట భద్రతతోపాటు పారిశుధ్య నిర్వహణ, పార్కింగ్, సౌండ్ అండ్ లైటింగ్ ఏర్పాట్ల బాధ్యతను ఆయా శాఖాధికారులకు అప్ప గించా మన్నారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ జానకి తెలిపారు. పాలమూరులోకి ఎంట్రీ కాగానే ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుం డా నేరుగా వారిని పిల్లలమర్రి వద్దకు తీసుకెళ్లేందుకు బందోబస్తు పూర్తి చేశాం. 3 గంటలు సాగే ఈ పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు త లెత్తకుండా చూస్తా మన్నారు. సందర్శకులకు అనుమతి లేదని సూచించారు.
పిల్లలమర్రికి సుందరీమణుల శోభ
పాలమూరులోని పిల్లలమర్రి పర్యాటక క్షేత్రానికి అందమైన భామల రాకతో మరింత వన్నె రానున్నది. పిల్లలమర్రి జవసత్వాలు కోల్పోతుంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అధికార యంత్రాంగం దగ్గరుండి పునర్జీవ చర్యలు చేపట్టింది. నాడు సందర్శకులు చెట్టు ఊడలకు నష్టం కలిగించేలా వ్యవహరించడం.. సమీపంలోని ఓ ప్రార్థన స్థలం నుంచి వస్తున్న పొగతో మహావృక్షానికి ప్రమాదం దాపురించింది. పర్యాటకశాఖ అధికారులు నిర్ల క్ష్యం వహించడంతో ఎండిపోయే దశకు చేరింది. అప్పటి కలెక్టర్ రొనాల్డ్ రోస్ దగ్గరుండి ఈ వృక్షానికి.. మనిషికి ఎలా అయితే స్లైన్లు ఎక్కిస్తారో.. అలాగే ఈ మర్రికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అలాంటి ట్రీట్మెంట్ను అందించి మహావృక్షం కనుమరుగు కాకుండా చర్యలు చేపట్టింది. ఊడలను.. చెట్ల వేర్లను కాపాడి తిరిగి మహావృక్షాన్ని పచ్చదనంతో నింపేశారు. సుమారు రెండెకరాల స్థలంలో విస్తరించిన ఈ వృక్షానికి సందర్శకులు దగ్గరి నుంచి వీక్షించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. వృక్ష సంరక్షణ చర్యల్లో భాగంగా సందర్శకుల ఎంట్రీపై నిషేధం విధించారు.
ప్రపంచ పటంలో పాలమూరు మర్రి
తెలంగాణలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వారిలో 22 మంది సుందరీమణులు పాలమూరు పిల్లలమర్రి పర్యాటక ప్రాంతాన్ని సందర్శించేందుకు ఎంచుకున్నారు. జిల్లా కేంద్రం సమీపంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ మహావృక్షం చూడాలని కొంతమంది ఉత్సా హం చూపడంతో అధికార యంత్రాంగం వెంటనే ఏర్పాట్లకు ఆదేశించింది. దీంతో అధికారులు ఏర్పాట్లలో మునిగిపోయారు. జిల్లా యంత్రాంగం దగ్గరుండి వారికి పిల్లలమర్రి ప్రాముఖ్యతను వివరించనున్నారు.