మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జులై 31 : రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్స్నకు నిధులు వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో 2వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరవిందస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో బకాయి ఉన్న రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్స్నకు నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు.
ఈ నిధులు సకాలంలో అందకపోవడంతో కళాశాలల్లో సర్టిఫికెట్లు నిలిపివేస్తుండటంతో విద్యార్థుల భవిష్యత్ అంధకారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలనిన కోరారు. అదే విధంగా బీసీ హాసళ్లకు నూతన భవనాలను నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జాతీయ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు బాధనమోని వెంకటేశ్, కార్యదర్శి శ్రావణ్‌కుమార్, దామోదర్, వెంకటేశ్, గోపి తదితరులు పాల్గొన్నారు.