వనపర్తి టౌన్, ఫిబ్రవరి 24 : స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే వి డుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి అరవింద్‌స్వామి డిమాండ్ చేశారు. సో మవారం విద్యార్థులతో కలిసి జి ల్లాకేంద్రంలో కలెక్టరేట్ ముట్టడించి ధర్నా చేపట్టారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడు తూ తెలంగాణలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు సం బంధించిన స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలన్నారు. ప్రభుత్వం ఫీజు బకాయిలను చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యం విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వని పరిస్థితి నెలకొందని.. దీంతో విద్యార్థులు చదివిన చదువుకు ఫ లితం లేకుండా పోయిందన్నారు.
ఈ సమస్యతో ఉన్న త చదువులు చదివిన విద్యార్థులు కూలీ పనిచేసుకుంటూ కార్మికులుగా తయారవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలను చెల్లించాలని.. లేకుంటే రాబోయే రోజుల్లో క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా బీసీ సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలనే అంశాలపైన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ ముట్టడించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నేతలు చిట్యాల రాము, లోకేశ్‌యాదవ్, చక్రి, షఫీ, బీచుపల్లి ముదిరాజ్, మహేశ్, రాకేశ్, నాగేంద్రం పాల్గొన్నారు.