ధరూరు, జూన్ 25 : అబద్ధపు హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి నేడు ఆ హామీలను, గ్యారెంటీలను విస్మరించిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు పిలుపునిచ్చారు.
వచ్చేది కేసీఆర్ సారే.. మళ్లీ గెలిచేది బీఆర్ఎస్సే అని ఆయన జోస్యం చెప్పా రు. గురువారం ధరూరు మండలం నర్సన్దొడ్డికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఉపసర్పంచ్ కుర్వ లక్ష్మన్న తన అనుచరులతో కలిసి బాసు ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో రాఘవేందర్‌రెడ్డి, అల్లపాడు ప్రతాప్‌రెడ్డి, రాజారెడ్డి, రాముడు, సోమశేఖర్‌రెడ్డి, తిమ్మప్ప, జాంపల్లి భరతసింహారెడ్డి, వీరేశ్, రాజు, నర్సింహులు, గోవిందు, అంజి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.