దేవరకద్ర, జూలై 21 : జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు అయిన కోయిల్‌సాగర్‌లో రోజురోజుకూ నీటి మట్టం పెరుగుతున్నది. ప్రాజెక్టుకు ఎగువ ప్రాం తంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి వరద చేరుతుండడంతో ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టులో 17.5 ఫీట్లకు చేరిందని అధికారులు తెలిపారు.
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.5 ఫీట్లు, మరో 15 ఫీట్ల మేర ప్రాజెక్టులోకి నీరు వస్తే గేట్లు తెరిచే అవకాశం ఉన్నది. అదేవిధంగా గూరకొండ-బండర్‌పల్లి మధ్యనున్న ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్‌డ్యాం నిండి అలుగు పారుతుండడంతో సందర్శకులను ఆకట్టుకుంటున్నది.