అయిజ, డిసెంబర్ 28 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు తెలంగాణ ఇండెంట్ నీరు చేరలేదు. ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలో యాసంగిలో సాగు చేసిన పంటలకు నీటి లభ్యత తగ్గడంతో ఈనెల 26న తుంగభద్ర జలాశయం నుంచి 2024-25 ఏడాదికిగానూ 5.896 టీఎంసీల నీటివాటా నుంచి 1.078 టీఎంసీలను టీబీ బోర్డు అధికారులు విడుదల చేశారు. మొదటి ఐదు రోజులు 1,500 క్యూసెక్కులు, చివరి ఐదు రోజులు వెయ్యి క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల కొనసాగనున్న ది. కాగా టీబీ డ్యాం నుంచి నీటిని విడుదల చేసి మూడ్రోజులు అవుతున్నా ఆర్డీఎస్కు చేరకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
తుంగభద్ర నదిలో నీటి లభ్యత స్వల్పంగా ఉన్నప్పటికీ ఇండెంట్ నీరు ఆనకట్టకు సకాలంలో చేరకపోవడంలో ఆంతర్యమేమిటోనని రైతులు ఆవేదన చెందుతున్నారు. శనివారం నాటికి నీరు చేరాల్సి ఉన్నా.. ఎగువన ఉన్న కర్ణాటక రైతులు ఆర్డీఎస్ నీటిని ఎక్కడ తోడేస్తున్నారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. ప్రస్తుతం నీటినిల్వ 6.4 అడుగులు ఉండ గా.. ప్రధాన కాల్వకు 285 క్యూసెక్కులు వి డుదల చేస్తున్నారు. అయితే ఆదివారం మ ధ్యాహ్నం నాటికి నీరు వచ్చే అవకాశం ఉన్నదని ఆర్డీఎస్ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. నీళ్లు రాగానే ప్రధాన కాల్వకు నీటి విడుదల పెంచుతామని పేర్కొన్నారు.