అంతా మా ఇష్టం..!!
మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, నగర పాలక సంస్థకు ప్రథమ పౌరురాలు.. అత్యున్నత పదవీ...అన్ని ఉతుత్తవేనా? పాలమూరు కార్పొరేషన్‌కు తొలి మహిళా మే యర్‌ను కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుందా? కాంగ్రెస్‌లో చక్రం తిప్పుతున్న ఓ నాయకుడి జోక్యం ప్రస్తుతం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది.
- మేయర్‌ను డమ్మీ చేసే యత్నం..
- గన్‌మెన్ కేటాయించకుండా చక్రం తిప్పుతున్న ఓ నాయకుడు..
- అంతా ఆయన కనుసన్నల్లోనే..
- పాలమూరు తొలి బీసీ మహిళా మేయర్ కట్టడికి యత్నం..
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, నగర పాలక సంస్థకు ప్రథమ పౌరురాలు.. అత్యున్నత పదవీ…అన్ని ఉతుత్తవేనా? పాలమూరు కార్పొరేషన్‌కు తొలి మహిళా మే యర్‌ను కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుందా? కాంగ్రెస్‌లో చక్రం తిప్పుతున్న ఓ నాయకుడి జోక్యం ప్రస్తుతం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. అంతా మా ఇష్టం మేము చెప్పినట్లే వినాలి అంటూ ఆర్డర్లు వేస్తున్నా రా? అసలు పాలమూరు కార్పొరేషన్లో ఏం జరుగుతుంది? అని అధికార పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.
మేయర్ విధులు, గౌరవం, ప్రోటోకాల్ వ్యవహారం అంతా ఓ రేంజ్లో ఉంటుం ది. పురపాలక చట్టాల ప్రకారం అన్ని మేయర్‌కు సమకూరుతాయి. ఇంత ఉన్న మేయర్ చాంబర్‌కు తుది మెరుగులు దిద్దాల్సిన కార్పొరేషన్ అధికారులు డిప్యూటీ మేయర్ చాంబర్ కోసం రూ.32 లక్షల ఖర్చు పెట్టడం కూడా వివాదాస్పదమవుతోంది. అంతేకాక మేయర్‌కు జిల్లా పోలీస్ యంత్రాంగం గన్‌మెన్ కల్పించాల్సి ఉండగా… దానిని కూడా సదరు నేత అడ్డుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా భద్రత కల్పించకుండా మౌనంగా ఉండడం ఈ ఆరోపణలకు బలం చేకూరుతున్నది.
ఈ విషయమై ఓ పోలీస్ ఉన్నత అధికారిని ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించగా మేయర్‌కు గన్‌మెన్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా మిగతా కార్పొరేషన్లకు మేయర్‌గా ఖరారైన వెంటనే గన్మెన్లను కేటాయించారు. ఇదిలా ఉండగా నగరపాలక సమావేశంలో కూడా వేదికపై మేయర్ ఒక్కరే కూర్చోల్సి ఉండగా ప్రోటోకాల్‌ని కాదని డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యే సైతం వేదిక ఎక్కారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూ వేదికపై ఉండడం ఏంటని నిలదీశారు.
సమావేశాన్ని సైతం వాకవుట్ చేశారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌గా మా రిన అనంతరం అధికార కాంగ్రెస్ పార్టీ లో అనేక రాజకీయ పరిణామా లు.. పదవుల పంపకం లో జరిగి న వ్యవహారాలు రచ్చకెక్కిన ఎమ్మెల్యే మేయర్ పదవికి పోటీలేకుండా ఎంపిక కార్యక్రమం ముగించారు. ఈ లోపు మేయర్ పీఠం విషయంలో కూడా కాంగ్రెస్‌లో ఒక వర్గం ఏదో జరిగిందని ఆరోపణలకు దిగారు. దీన్ని ఖండిస్తూ మిగతా నేతలు మీడియా ముందుకు వచ్చి రచ్చ చేశారు. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న పరిణామాలు మేయర్‌ను డమ్మీ చేస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నా యి.
గన్‌మెన్ కేటాయించకపోవడం…కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ చాంబర్‌ను వదిలేసి డిప్యూటీ మేయ ర్ చాంబర్‌ను ముస్తాబు చేయడం.. జిల్లా కేంద్రంలో జరిగే ప్రో గ్రాంలకు కూడా కట్టడి చేసే ప్రయత్నం జరగడం జరుగుతుందని కాంగ్రెస్‌లోని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. అందుకే గన్‌మెన్‌ను కేటాయించకుండా అడ్డుకుంటున్నారని.. కార్పొరేషన్ లో బీసీ వర్సెస్ రెడ్డి రాజకీయ మొదలైందని గుసగుసలాడుతున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

