మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/గద్వాల, సెప్టెంబర్ 13 : ‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగడం ఖాయం.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ విజయ ఢంకా మో గించడం ఖాయం.. మీకు దమ్ముంటే పది మంది ఎమ్మెల్యే లతో రాజీనామా చేయించు.. ఎన్నికలకు వస్తే చూసు కుందాం’.. అని రేవంత్‌రెడ్డికి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. శనివారం గద్వాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన గద్వాల గర్జన సభలో కేటీఆర్ మాట్లాడారు. నాడు వలసలకు నిలయమైన ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేడు రివర్స్ వలసలు వచ్చేలా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
పాలమూరు జిల్లాకు రివ ర్స్ మైగ్రేషన్ వచ్చిందని పాలమూరు జిల్లాకు కర్ణాటక, కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారన్నారు. గద్వాల రావాలని పట్టుబట్టి ఇక్కడికి రప్పించారు.. తెలంగాణ ఉద్యమంలో గద్వాల్ ముందు ఉందన్నారు. గద్వాల జిల్లా కేంద్రం అయింది అంటే కేసీఆర్ కారణమని మారుమూల ప్రాంతంగా ఉన్న గద్వాలను జిల్లా చేసి అభివృద్ధి చేశారన్నారు. గద్వాలకు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ కేసీఆర్ ఇచ్చారని, ప్రస్తుతం పట్టణంలో బ్రహ్మండంగా భవనాలు కనిపిస్తున్నాయన్నారు. గద్వాల పట్టణానికి 1200 డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చాం మేము కట్టిన ఇండ్లకు మూడు రంగులు వేసి ఇందిరమ్మ ఇండ్లు అంటూ ముగ్గురు మంత్రులు రిబ్బన్ కట్ చేశారు.. ఈ ఇల్లు కట్టించింది కేసీఆర్ కాదా అంటూ జనాన్ని అడిగారు. గట్టు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా ఎండ బెట్టింది కాంగ్రెస్ కాదా? అని విమర్శించారు.
కొంతమంది ఏం మొఖం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నిస్తున్నారని, గ ద్వాలను జిల్లా చేసిన బీఆర్ఎస్ పార్టీ గద్వాలకు రావద్దా..? అని జనంలో ప్రశ్నించగా రావాలి.. రావాలి.. అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణమోహన్‌రెడ్డి గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరను రైలుకింద తలపెట్టి చచ్చిపోతాను అన్నారు.. మరి తర్వాత సొంత అభివృద్ధి కోసం పార్టీ మారారా? లేక నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారారా? అని నిల దీశారు. ఎమ్మెల్యే ఎందుకు పార్టీ మారిండు.. పింఛన్లు, తు లం బంగారం, రైతు భరోసా రూ.15 వేలు ఇచ్చినందుకు పార్టీ మారిండా? ఆడబిడ్డలకు నెలకు 2,500 వస్తు న్నాయా? అని ప్రశ్నించారు. టీవీలోళ్లు ఎమ్మెల్యేను ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నిస్తే బీఆర్ఎస్లో ఉన్నానని కృష్ణమోహన్‌రెడ్డి అంటున్నారు.. బీఆర్ఎస్ మీటింగ్ ఇక్కడ జరుగుతుంటే ఎమ్మెల్యే వెళ్లి రేవంత్‌రెడ్డి చంకలో చేరారని మండిపడ్డారు. పది మంది ఎమ్మెల్యేలు కచ్చితంగా రాజీనామా చేయక తప్పదు.. ఉపఎన్నిక రావడం తప్పదన్నారు. గద్వాల ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెప్తామని రాబోయే ఆరు, తొమ్మిది నెలల్లో గద్వాలకు ఉపఎన్నికలు తప్పవన్నారు. గద్వాలకు కప్పుడు ఎన్నికలొచ్చినా బీఆర్ఎస్ 50 వేల మెజారిటీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు.
20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది?
సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కరోనా వచ్చినా కేసీఆర్.. పింఛన్లు, రైతు బంధు, కల్యాణలక్ష్మి ఇచ్చారు.. కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు అందజేశారన్నారు. రేవంత్‌రెడ్డికి బంగారు పళ్లెంలో తెలంగాణను అప్పగిస్తే.. తెలంగాణ అప్పులపాలైందనని అంటున్నారు.. ఇదెక్కడి న్యాయమన్నారు. రాష్ట్రం దివాళా తీసింది అని రేవంత్‌రెడ్డి మాట్లాడు తున్నారు.. లంకెబిందెలు ఉం టాయని సెక్రటేరియట్‌కు వచ్చారంట.. లంకెబిందెల కోసం ఎవరు తిరుగుతారని కేటీఆర్ ప్రశ్నించగా.. జనాలు దొంగలు.. దొంగలు అని సెటైర్ వేశారు. అలాంటి రేవంత్‌రెడ్డి దొంగల ముఠాలో గద్వాల ఎమ్మెల్యే చేరిపోయారని విమర్శించారు. రాబోయే రోజుల్లో గద్వాల బిడ్డ బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తారని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని, దళితబంధు రూ.12 లక్షలు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు? అంబేద్కర్ భరోసా వచ్చిందా? అంటూ ప్రశ్నించారు.
రెండు ఉద్యోగాలు ఊడగొడితే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా మని అని..కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను మేము ఇచ్చామని రేవంత్‌రెడ్డి చెప్పుకుంటున్నారన్నారు. యూరియాను కాంగ్రెస్ నేతలు బుక్కుతున్నరూ.. బ్లాక్ మార్కెట్లో అమ్ము కుంటున్న దుర్మార్గులు కాంగ్రెస్ నేతలు అని దుయ్య బట్టారు. గ్రూప్-1 ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు.. గ్రూప్-1 లో రూ.1,700 కోట్లు దండుకున్నారని కేటీఆర్ విమర్శించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశారని రెండేళ్లలో రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 18 లక్షల ఎకరా లకు నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు. గద్వాల్ ఎమ్మెల్యే శఠగోపం, పంగనామం పెట్టి రేవంత్‌రెడ్డి సంకలో దూరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు ఆత్మహ త్యలు చేసుకుంటున్నారు..రాహుల్‌గాంధీ వచ్చి చెప్తే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశా మని నిరుద్యోగులు బాధప డుతున్నారన్నారు. గురుకులాల్లో 105మంది పిల్లలు చనిపోయారన్నారు. నాటకాలు ఆడుతున్న పదిమంది ఎమ్మెల్యేల భరతం పట్టాలని ప్రజలనుకోరు తున్నాన న్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిం చాలని గద్వాల్‌కు ఎవరు అభ్యర్థి అనేది కేసీఆర్ నిర్ణయి స్తారన్నారు. ఇథనాల్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టి జైల్లో పెట్టిందని ప్రభు త్వానికి నడిగడ్డపై ప్రేమ ఉంటే ఇథనాల్ ఫ్యాక్టరీ లైసెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గులాబీ జెండా ఎగరడం ఖాయం : ఆంజనేయగౌడ్
‘గద్వాలో జరిగే కేటీఆర్ సభను అడ్డు కోవడానికి ఇక్కడి నాయకులు ఎన్నో ప్రయత్నాలు చేశారు.. అయినా బీఆర్ ఎస్ కార్యకర్తలు వారి కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టడంతో సభను విజయవంతంగా నిర్వహించాం’ అని సాట్ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ అన్నారు. సభ రద్దు అని సోషల్ మీడియాలో అధికార పార్టీ నాయ కులు ప్రచారం చేశారని.. సభను అడ్డుకో వడానికి ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా పార్టీ కార్యకర్తల అండతో సభను గ్రాండ్ సక్సెస్ చేశా మన్నారు. గద్వాల కోటపై స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఉద్ధేశించి ఆయన ఆసక్తికర వాఖ్యలు చేశారు. అత్త ఆణిముత్యం, అల్లుడు స్వాతిముత్యమని చెప్పడంతో సభలో నాయకులు, కార్యకర్తలు చప్పట్లు కొట్టా రు. గద్వాల బీఆర్ఎస్ పాలనలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు.
ఆదరణ తగ్గలేదు.. : హనుమంతు
ఎవరు పార్టీ మారినా బీఆర్ఎస్కు గద్వాలలో ఆదరణ తగ్గలేదని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు అన్నారు. గద్వాల నియో జకవర్గంలో రానున్నది బీఆర్ఎస్ అన్నారు. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి 50 వేల మెజార్టీతో గెలుస్తారని జోష్యం చెప్పారు. అధికార పార్టీ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్త లను సభకు రాకుండా భయపెట్టారని అయినా వారి భయాన్ని లెక్క చేయక సభ కు పెద్ద ఎత్తున తరలివచ్చారని చెప్పారు. నడిగడ్డలో బీఆర్ఎస్కు ఎదురులేదని చెప్పారు. గద్వాల నియోజక వర్గంలో గులాబీ జెండాకు కార్యకర్తలు అండగా ఉన్నార నని గుర్తు చేశారు. పార్టీలో పదువులు అనుభవించిన వారు పార్టీ వదిలి వెళ్లిపోయారని, అప్పటి నుంచి పార్టీకి నియోజకవర్గంలో అండగా ఉన్నానని చెప్పా రు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగుర వేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
బీఆర్ఎస్ అభివృద్ధికి కృషి చేస్తా.. : కేశవ్
గద్వాల పట్టంలో బీఆర్ఎస్ అభివృద్ధ్దికి కార్యకర్తలా పని చేస్తానని మున్సిపల్ మాజీ చైర్మన్ కేశవ్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ ఆదేశాల మేరకు ఇక్కడి ఎమ్మె ల్యేను గెలిపించానని చెప్పారు. కేటీఆర్ ఆదేశిస్తే వచ్చే ఎన్ని కల్లో ఎవరినైనా బొంద పెట్టడానికి సిద్ధ్దంగా ఉన్నానని తెలి పారు. కేటీఆర్ నాయకత్వంలో పార్టీ కోసం సైనికుడిలా పని చేస్తాన్నారు. మా వెంట మూడు అక్షరాల కేటీఆర్ ఉన్నారని ఆయన కోసం మేము దేనికైనా సిద్ధం అన్నారు. గద్వాల మున్సిపాల్టీలో గులాబీ జెండా ఎగురవేయడానికి కార్యకర్తగా పని చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మె ల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్‌కుమార్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఇంతియాజ్, ఆంజనేయగౌడ్, రజిని, నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు, శ్యామల, విజయ్‌కుమార్, డాక్టర్ కురువ విజయ్‌కుమార్, పల్లయ్య, రాఘ వేంద్రరెడ్డి, నాగర్‌దొడ్డి వెంకట్రా ములు, పద్మా వెంకటేశ్వరరెడ్డి, బాసు శ్యా మల, విష్ణువర్ధన్‌రెడ్డి, కురువ పల్లయ్య, అంగడి బస్వరాజ్, బీచుపల్లి, మోనేశ్, చక్రధర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి..
గద్వాల జిల్లా కేంద్రంలో కేటీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేటీఆర్ సమక్షంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్‌తోపాటు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ యూసుఫ్, మాజీ జెడ్పీటీసీ పద్మా వెంకటేశ్వరరెడ్డి, మాజీ కౌన్సిలర్లు జయలక్ష్మి, అరుణ, లక్ష్మి, రంజిత్, జయమ్మ, మహేశ్, జమన్సింగ్, రామచంద్రుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అమరవాయి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ జయమ్మ, ప్రతాప్, మాజీ ఉపసర్పంచులు వెంకటేశ్, గోకారి, గోవిందు, ఆశన్న తదితరులు చేరారు.
వర్షంలో సైతం సడలని అభిమానం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పై జనం అభిమానం ఉందనడానికి గద్వాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన గద్వాల గర్జన సజీవ సాక్షంగా నిలిచింది.. ఒకవైపు వర్షం పడుతున్నా కేటీఆర్ కోసం జనం తేరు మైదానానికి తండోపతండాలుగా తరలివచ్చారు. అంతకుముందు ఎర్రవల్లి చౌరస్తా నుంచి గద్వాల్ వరకు గులాబీ జెండాలతో జనసంద్రంగా మారింది. భారీ కాన్వాయ్‌తో కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో వర్షంలో సైతం జై కేసీఆర్, కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేటీఆర్ జనం స్పందనను చూసి బీఆర్ఎస్ పాలన కాంగ్రెస్ పాలనకు బేరీజు వేస్తూ సాగిన ప్రసంగం ఆకట్టుకున్నది. కేటీఆర్ సభలోకి రాగానే జనం ఒక్కసారిగా జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు.