నాగర్కర్నూల్/కొల్లాపూర్, మే 18 : ఎన్నికలకు ముందు ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలని కోరుతూ తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో మేరకు సోమవారం ఆశ కార్యకర్తలు కొల్లాపూర్ పట్టణంలోని మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కళావతి, జిల్లా నాయకురాలు చెన్నమ్మ, శివలీల మాట్లాడుతూ 2023 సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు చేపట్టిన సమ్మె సమయంలో తాము అధికారంలోకి వస్తే వెంటనే వేతనాల ను పెంచుతామని, రూ.లక్షల ఇన్సూరెన్స్, రూ.50 మట్టి ఖర్చులు, రిటైర్డ్ బెనిఫిట్స్ అం దిస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారని గుర్తుకు చేశారు.
ప్రభుత్వం ఏర్పడి మూ డేండ్లు అవుతున్నా ఆశ కార్యకర్తల ఒక్క సమస్యను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వెం టనే ఆశ కార్యకర్తలకు ప్రతి నెలా 1వ తేదీన రూ.18వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలన్నారు. పని భారం తగ్గించాలన్నారు. ఆశ కార్యకర్తల సమస్యలను పరిష్కారం చేయకుంటే ఆందోళన బాట పడుతామన్నారు. ప్రజా సంఘాల నాయకులు శివవర్మ, శంకర్, ఎండీ సలీం, రాజు తదితరులు ఆశ కార్యకర్తల నిరసన కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియ న్ నాయకురాలు సుజాత, విజయలక్ష్మి, జ్యోతి, శారద, వెంకటమ్మ, వరలక్ష్మి, జయ మ్మ, ఆదిలక్ష్మి, లక్ష్మమ్మ, అరుణ, మల్లికాంత, మల్లేశ్వరీ, రవణమ్మ, కర్ణ పాల్గొన్నారు.
తమకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశ కార్యకర్తలు సోమవారం జిల్లా కేంద్రంలోని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. సమస్యలను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు పూనుకుంటామని హెచ్చరిస్తూ ధర్నాకు దిగా రు. తెలంగాణలో కాంగ్రెస్ నూతన ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాకముందు తాము అధికారంలోకి వస్తే ఆశ కార్యకర్తలకు ఫిక్డ్స్ వేతనం రూ.18వేలు అమలు చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పిందని మండిపడ్డారు.
అనంతరం ఎమ్మెల్యే లేకపోవడంతో గేటుకు వినతిపత్రాన్ని పెట్టి వెనుదిరిగారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా కోశాధికారి రామయ్య, ఆశ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి, కృష్ణవేణి, సువర్ణ, కార్యకర్తలు చంద్రకళ, శిరీష, వరలక్ష్మి, విజయనీల, అమీనా, లక్ష్మి, భాగ్యమ్మ, వెంకటమ్మ, మం జుల, గౌరమ్మ, వెంకటమ్మతోపాటు వివిధ గ్రామాల ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.