మహబూబ్‌నగర్, జనవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక కోసం పాలమూరు ముస్తాబవుతున్నది. జిల్లాకేంద్రంలో ఎంబీ సీ మైదానంలో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పార్టీ నేతలతో కలిసి శనివారం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభ ప్రాంగణాన్ని చూసి పలు సూచనలు చేశారు. కేటీఆర్తోపా టు ముఖ్య నేతలు సభ వేదిక వద్దకు చేరేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
మహబూబ్‌నగర్, నా రాయణపేట జిల్లాలో ఇటీవల పంచాయతీ ఎన్నిక ల్లో గెలుపొందిన సర్పం చ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారికి ప్రత్యేక గ్యాలరీలు ఏర్పా టు చేయాలని సూచించారు. అంతేకాకుండా హాజరయ్యే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీ ముఖ్య నేతలు వేదికపై కూర్చొనే అవకాశం ఉండడంతో ఆ స్థాయికి తగ్గట్టు వేదిక పెద్దగా ఏర్పాటు చేయాలన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులను ఆదేశించా రు. పర్యటన సక్సెస్ చేయాలని సూచించారు. పాలమూరు జిల్లా కేంద్రం బ్యానర్లు, ఫ్లెక్సీలు, జెండాలతో గులాబీమయంగా మారింది. ఆయన వెంట గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పట్టణ అధ్యక్షుడు శివరాజ్, ఆంజనేయులు, తాటి గణేశ్, అనంతరెడ్డి తదితరులు ఉన్నారు.