మహబూబ్నగర్, నవంబర్ 24 : బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఎకో పార్కు నుంచి అప్పన్నపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వరకు బట్టర్ఫ్లై లైట్లను ఏర్పాటు చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నెలలుగా ఎకో పార్కు నుంచి అప్పన్నపల్లి వరకు లైట్లు సక్రమంగా వెలగడం లేదు.
చాలా వరకు లైట్లు వేసినట్లే అనిపించినా ఎప్పుడూ బ్లింక్ అవ్వడం, ఆరిపోవడం తప్పా పూర్తిస్థాయిలో వెలగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతునారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లైట్లు సక్రమంగా వెలిగేందుకు చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.