ఉప్పునుంతల, ఫిబ్రవరి 23 : విచ్చలవిడిగా నిర్వహిస్తున్న ఇసుక అక్రమ రవాణాపై శుక్రవారం మండలంలోని మొల్గర గ్రామస్తులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. మండలంలోని మొల్గర సమీపాన ఉన్న దుందుభీలో వారం రోజులుగా కాంగ్రెస్ నాయకు లు జేసీబీలతో ఇసుకను తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్లతో అక్రమంగా రవాణా చే స్తున్నారు. సంబంధిత అధికారులు ప ట్టించుకోకపోవడంతో శుక్రవారం ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు.
సీసీ రోడ్ల నిర్మాణం పేరిట ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. దుందుభీ వాగు పూర్తిగా ఎడారిగా మారి భూగర్భజలాలు అడుగంటి పోయాయన్నారు. రానున్న రోజుల్లో నీటి సమస్య జఠిలమవుతుందన్నారు. అధికారులు పట్టించుకోకపోతే మార్చి 1న తాసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.