మక్తల్, సెప్టెంబర్ 15 : తమ సమస్యలను ప్రభు త్వం పరిష్కరించడం లేదని అంగన్వాడీ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో ‘హలో అంగన్వాడీ-చలో మక్తల్’ పేరిట మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు రూ.18 వేల వేతనంతోపాటు పీఎఫ్, పెంచిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అం గన్‌వాడీల సమస్యలు ఆలకించిన మంత్రి శ్రీహరి స్పందిస్తూ ఆర్థిక సమస్యల పరిషారానికి ప్రభు త్వం కట్టుబడి ఉన్నదని భరోసానిచ్చారు. త్వరలో జరగబోయే క్యాబినెట్ సమావేశంలో చర్చించి సమస్య పరిషారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, జిల్లా నాయకులు ఆంజనేయులు, గోవింద్రాజ్, అంగన్వాడీ వర్కర్స్ యూ నియన్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, ప్రాజెక్టు అధ్యక్షురాలు మంజుల, మండల అధ్యక్షురాలు రాధికతోపాటు అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు.